దివంగత స్టార్ హీరోయిన్ అయినటువంటి మహానటి సావిత్రి తన నటనతో మహానటి అనే బిరుదుని సంపాదించుకుంది. అయితే అలాంటి సావిత్రి బయోపిక్ గా మహానటి అనే సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ నటించింది.అలాగే సావిత్రి భర్త జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్  నటించారు. అలాగే విజయ్ దేవరకొండ, సమంత, ప్రకాష్ రాజ్,అనన్య పాండే, నాగచైతన్య, రాజేంద్రప్రసాద్,మాళవిక నాయర్,శ్రీనివాస్ అవసరాల, క్రిష్ జాగర్లమూడి, భానుప్రియ,దివ్యవాణి వంటి భారీ తారాగణంతో మహానటి మూవీ తెరకెక్కింది. ఈ సినిమా సావిత్రమ్మ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. అయితే ఈ సినిమా సమయంలో కొంతమంది కొన్ని వాదనలు తెరమీదకి వినిపించినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

అయితే ఈ సినిమాకి కీర్తి సురేష్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుకున్నాక నిర్మాతలు,డైరెక్టర్ ఇంటికి వెళ్లి కీర్తి సురేష్ ని కలిసి సినిమా స్టోరీ చెప్పి మీరు సావిత్రమ్మ గారి బయోపిక్ లో సావిత్రి గారి పాత్రలో నటించాలి అని చెప్పారట.అయితే అంత పెద్ద హీరోయిన్ బయోపిక్ లో నేను నటించడం అంటే పెద్ద గొప్ప.కానీ సినిమా చేసే సమయంలో నేను సావిత్రమ్మ గారిలా నటించకపోతే ఆమె ఫ్యాన్స్ ఒప్పుకోరు.ఆమె ఒక లెజెండ్ నటి..ఆమె పాత్రలో నేను చేయాలంటే ఆమెలాగే చేయాలి.ఎక్కడ తేడా కొట్టిన కూడా ఆమె అభిమానులు ఒప్పుకోరు. అలాగే మీరు ఆమె పర్సనల్ లైఫ్ చూపించాలి అనుకుంటున్నారు. ఆ పర్సనల్ లైఫ్ చూపించడాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఫాన్స్ కి నచ్చకపోతే ఎలా.. నేను ఈ సినిమాలో నటించను అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి కీర్తి సురేష్ మొహం మీదే చెప్పేసిందట.

అయితే లెజెండరీ నటి సావిత్రి గారి బయోపిక్ అంటే కీర్తి సురేష్ ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటుందని ఎంతో కాన్ఫిడెంట్ గా నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్న దత్,డైరెక్టర్ నాగ్ అశ్విన్ లు వచ్చారట.కానీ కీర్తి సురేష్ ఫ్యాన్స్ కి భయపడి చేయనని చెప్పడంతో వాళ్ళు  షాక్ అయ్యారట. కానీ ఆ తర్వాత నాగ్ అశ్విన్ నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది.ఈ పాత్రలో మీరు మాత్రమే నటించగలరు. నాకంటే మీ మీద నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది అని కీర్తి సురేష్ తో చెప్పారు.దాంతో కీర్తి సురేష్ నామీద నాకు లేని నమ్మకం డైరెక్టర్ కి నామీద ఉండడంతో వెంటనే ఒకే చెప్పేసాను అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మహానటి మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది.ఇక మహానటి మూవీ తర్వాత కీర్తి సురేష్ దశ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ఈమెకు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి: