యస్..ఇక పై అల్లు అర్జున్ ని అలా పిలవకూడదా..? అంటే అవును అనే అంటూ మండిపడిపోతున్నారు ఫ్యామిలీ మెంబర్స్. మనకు తెలిసిందే అల్లు అర్జున్ ఒక స్టైలిష్ స్టార్ అని ..ఒక ఐకాన్ స్టార్ అని.. ఒక నాటి హీరో అని.. ఒక పాన్ ఇండియా స్టార్ అని ఎన్నో ట్యాగ్స్ తో పిలుచుకుంటూ ఉంటారు . అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరేగా మారిపోయింది . అల్లు అర్జున్ పేరు చెప్పేముందు అందరూ కూడా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యాడే ఆ అల్లు అర్జున్ అంటూ సాగదీసి మరి చెప్తున్నాడు.  అయితే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అల్లు అర్జున్ పేరు ముందు ఇకపై అలా పిలవకూడదు అంటూ స్పెషల్ గా ఒక నోట్  రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారట .


చాలామంది మీడియా సభ్యులు అల్లు అర్జున్ పేరు రాసేటప్పుడు స్టైలిష్ స్టార్ అని..ఐకాన్ స్టార్ అని.. ఎక్కువగా రాస్తూ ఉంటారు . కానీ అరెస్టు తర్వాత మాత్రం సంధ్య థియేటర్ తొక్కి సలాట ఘటనలో అరెస్టు అయిన అల్లు అర్జున్ అంటూ పదే పదే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అన్న విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. ఇది అల్లు అర్జున్ కెరియర్ కి టోటల్ మైనస్ గా మారిపోతుంది అని.. 22 ఏళ్లు కష్టపడి ఇంత స్థాయికి వచ్చాడు అని ..పొరపాటున జరిగిన ఇష్యూ కారణంగా అల్లు అర్జున్ ని ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కునేలా చేయొద్దు అని చాలా బాధ పడుతున్నారట.



దయచేసి ఆయన పేరు రాసే ముందు స్టైలిష్ స్టార్ అని.. లేకపోతే ఐకానిక్ స్టార్ అని..లేకపోతే పాన్ ఇండియా స్టార్ అని.. ఇవేవీ రాయకపోయినా కూడా పర్వాలేదు.. నార్మల్ అల్లు అర్జున్ అని పిలిచిన ప్రాబ్లం లేదు కానీ అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా చాలా బాధ కలుగుతుంది అంటూ కుటుంబ సభ్యులు .. ఆ ఇష్యూ ని మర్చిపోవడానికి .. ఆ ఇష్యూ నుంచి బయటపడడానికి అల్లు అర్జున్ సైతం మళ్లీ నార్మల్ పర్సన్ అవ్వడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట . త్వరలోనే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయబోతున్నారట . దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూసింత ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే విధంగా సిచువేషన్ రాబోతుంది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: