తెలుగు వారి సంస్కృతిలో సంక్రాంతి ఒక భాగం కాగా సినిమాతో విడదీయరాని బంధం కలిగి ఉంది. పెద్ద పండగ మూడు రోజులు పల్లెలు జనాలతో నిండిపోతాయి. కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరుతారు. కొత్త బట్టలు, పిండి వంటలు, అలంకరించిన ఇళ్ళు వాకిళ్లు, కోడి పందాలు, ముగ్గులు పోటీలు… సంక్రాంతి పండగ శోభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకు వెళ్లడం ఓ గొప్ప సరదా. సంక్రాంతి పండుగ దినాల్లో ఖచ్చితంగా సినిమా చూడడం అనవాయితీగా మారిపోయింది. అలాగే సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సంక్రాంతి సినిమాలు మనకు ఎన్నో తియ్యని జ్ఞాపకాలు మిగుల్చుతాయి. వాటిని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒకప్పటి స్మృతులు గొప్ప అనుభూతిని పంచుతాయి. మరి 2014లో సంక్రాంతికి విడుదలైన సినిమాలు గుర్తు చేసుకుందాం.

2014సంక్రాంతి రేసులో మహేష్, చరణ్ పోటీపడ్డారు. భారీ అంచనాల మధ్య విడుదలైన సుకుమార్ మూవీ వన్ నేనొక్కడినే 2014 జనవరి 10 న రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. అలాగే వంశీ పైడిపల్లి, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఎవడు మూవీ 2014జనవరి 12న విడుదలై సంక్రాంతి రేస్ లో విన్నర్ గా నిలిచింది.ఈ క్రమంలో మహేష్ బాబు 1 నేనొక్కడినే కంటే ఈ చిత్రం మెరుగ్గా ప్రదర్శించబడింది.ఇదిలావుండగా మగధీర, రచ్చ, నాయక్‌ చిత్రాల తర్వాత రామ్‌చరణ్‌ ₹40 కోట్ల మార్క్‌ను దాటిన నాలుగో చిత్రం ఎవడు.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వారం 1 షేర్‌తో టాప్ 10 తెలుగు చిత్రాల జాబితాలో అత్తారింటికి దారేది తర్వాత రెండవ స్థానంలో నిలిచింది.

ఈ క్రమంలో ఎవడు చిత్రం తన రాకింగ్ పనితీరును కొనసాగించి, ₹50 కోట్ల మార్క్ ను దాటేసింది.అలాగే మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రం ఎవడు కంటే చాలా వెనుకబడింది. నేనొక్కడినే రికార్డు స్థాయిలో విడుదలైనప్పటికీ, నెగిటివ్ టాక్ కారణంగా మంచి కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹30 కోట్ల కంటే తక్కువ వసూళ్లు రాబట్టింది.ఇక మొత్తం గా 2014సంక్రాంతి బరిలో యావరేజ్ టాక్ తో చరణ్, మహేష్ బాబు పై విజయాన్ని సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: