ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. జనవరి 10వ తేదీన భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం మరొక స్టార్ హీరోని వెనక్కి నెట్టేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా సినిమా అంటేనే కాంపిటీషన్.. సంక్రాంతి రేసులో సినిమాలు రిలీజ్ కావాలి అంటే ఏడాది ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు మేకర్స్. ముఖ్యంగా ఎంత ప్లాన్ చేసినా ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాకి తమిళ్ లో స్టార్ మూవీ భయం వెంటాడుతోంది. అదే అజిత్ విడాముయార్చి.

ఇటీవల ఈ సినిమా రిలీజ్ ను లైకా ప్రొడక్షన్స్ వాయిదా వేస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాతకు పెద్ద రిలీఫ్ లభించింది అని చెప్పవచ్చు.  ఇకపోతే ఈ సినిమా పోస్ట్ పోన్ వెనుక పెద్దతతంగమే నడిపించారట ప్రముఖ డైరెక్టర్ శంకర్.
లైకా ప్రొడక్షన్స్ పై డైరెక్టర్ శంకర్ ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ సినిమాను సంక్రాంతి బరి నుంచి లాస్ట్ మినిట్లో తప్పించినట్లు సమాచారం. డైరెక్టర్ శంకర్ లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్లో ఇండియన్ 2 సినిమా చేశారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ గా నిలిచింది.  అయినా కూడా లైకా తో ఇండియన్ 3 సినిమా చేయబోతున్నారు శంకర్.


ఇకపోతే దీని కంటే ముందే గేమ్ ఛేంజర్ సినిమాను విడుదల చేసి హిట్టు కొట్టాలని చూస్తున్నారు.  అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.. తమిళంలో గేమ్ ఛేంజర్ సినిమా కి హైప్ లేదు. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు కూడా గేమ్ ఛేంజర్ ని తీసుకోలేదు. దీంతో శంకర్ లైకా ప్రొడక్షన్స్ తో మాట్లాడినట్లు సమాచారం. ముఖ్యంగా అజిత్ మూవీ విడుదల ఆపేస్తే ఇండియన్ 3 ఫాస్ట్ గా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారట. అందుకే లైకా ప్రొడక్షన్స్ వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: