కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో సీనియర్ హీరోయిన్ గా ఖుష్బూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఖుష్బూకు ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలోనే ఆఫర్లు వస్తున్నా ఆమె పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. ఖుష్బూ తాజాగా మాట్లాడుతూ తన తండ్రి వల్ల తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. తన తండ్రి వల్ల కుటుంబం ఎన్నో సమస్యలు ఫేస్ చేసిందని ఆమె తెలిపారు.
 
తన తండ్రి తల్లి, సోదరులను చిత్రహింసలు పెట్టేవాడని ఆమె కామెంట్లు చేశారు. నాపై జరుగుతున్న లైంగిక దాడి గురించి చెబితే నా వాళ్లను ఇంకా నరకయాతన పెడతారని భయపడి చాలా కాలంగా ఈ దారుణాన్ని తాను బయటపెట్టలేదని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత మాత్రమే తాను ధైర్యంగా బదులివ్వడం నేర్చుకున్నానని ఖుష్బూ కామెంట్లు చేయడం గమనార్హం.
 
నాన్నకు ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయని అలా చేయడంతో నాన్న షూటింగ్ ప్రదేశానికి వచ్చి షూటింగ్ ప్రదేశానికి వచ్చి అందరి ముందు కొట్టేవాడని ఆమె చెప్పుకొచ్చారు. బాల్యంలోనే లైంగిక దాడిని ఎదుర్కొన్నానని నా తండ్రే నాపై ఈ దారుణానికి పాల్పడ్డాడని ఖుష్బూ వెల్లడించారు. ఖుష్బూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
 
14 సంవత్సరాల వయస్సులో ఉన్న సమయంలో లైంగిక వేధింపుల గురించి బయటకు వచ్చి మాట్లాడానని ఖుష్బూ పేర్కొన్నారు. ఆ తర్వాత నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడని ఆమె చెప్పుకొచ్చారు. నాన్న ఎక్కడికి వెళ్లాడో మాకు తెలియదని నేను కనుక్కోవాలని అనుకోలేదని ఖుష్బూ వెల్లడించారు. ఆ తర్వాత ఎప్పుడూ నాన్నను కలవలేదని ఖుష్బూ తెలిపారు. గతేడాది నాన్న మరణించారని తెలిసిన వాళ్లు చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. ఖుష్బూ చేసిన కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన వ్యక్తి గురించి కామెంట్లు చేయడం అవసరమా అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: