- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. ఇండియన్ సినిమా ప్రేమికులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా ఇది. గత రెండున్నర సంవత్సరాలుగా సెట్స్ మీద ఉండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పలు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 10న గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ ఈ సినిమాలో చరణ్ కి జోడిగా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రమోషన్ కంటెంట్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. తాజాగా మేకర్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ అయిందని చెప్పటంలో సందేహం లేదు. ట్రైలర్ రిలీజ్ కి ముందు ఎక్కడో కొన్ని అనుమానాలు చాలామందికి ఉన్నాయి.


శంకర్ ఇటీవల ఫామ్ లో లేకపోవడం చాలా మందికి కాస్త డౌట్ ఉంది. ట్రైలర్తో మాత్రం దర్శకుడు శంకర్ - హీరో రామ్ చరణ్ మొత్తం గేమ్ మార్చేశారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్లో కథ కథనాలపరంగా కాస్త పాత చాయ‌లు ఉన్నా ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాకుండా చాలామంది సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూస్తుంటే ఇంకా ఎక్కేస్తుంది అంటున్నారు. ఏది ఏమైనా మొత్తానికి గేమ్ ఛేంజర్ ట్రైలర్ మాత్రం గేమ్ చేంజ్ చేసేసి .. సినిమాపై మరిన్ని అంచనాల పెంచింది అని చెప్పాలి. రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్ తో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: