తెలుగులో పండగ సీజ‌న్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది .. అన్నిటిలోకి సంక్రాంతి అంటే ఎంతో స్పెషల్ .. సినిమా రిలీజ్ లకు ఇది బెస్ట్ టైం అలాగే మనోళ్లకు ఎంతో కాన్ఫిడెన్స్ .. పైగా సంక్రాంతి హీరో అనిపించుకునేందు కు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తారు .. అందుకే సంక్రాంతి కి పోటాపోటీగా సినిమాలు వచ్చే కల్చర్ మన దగ్గర ఉంది . ఒకసారి గ‌తాన్నీ చూస్తే మహేష్ వర్సెస్ చరణ్ .. చిరు వర్సెస్ బాలయ్య .. ఇలా మంచి పోటీ ఉండేది .. ఇక‌ గతంలో 2018 సంక్రాంతి సీజన్ పెద్ద గా ప్రేక్షకులకు మజా ఇవ్వలేదు ..


గత 2018 కి వచ్చిన సినిమాల్లో ప్రధానంగా బాలకృష్ణ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే విధంగా వార్‌ జరిగింది .. ఆ సమయంలో చాలా సినిమాలు వచ్చిన ప్రధానంగా వీరిద్దరి మధ్య పోటీ నడిచింది .. ముందుగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో రాగా .. ఆ తర్వాత బాలకృష్ణ జై సింహ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. అయితే ఈ 2018 వీరితో పాటు కోలీవుడ్ హీరో సూర్య కూడా గ్యాంగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చారు .. ఇలా ఈ 2018 సంక్రాంతికి వచ్చిన సినిమాలో బాలకృష్ణ సంక్రాంతి హీరోగా నిలిచాడు ..


బాక్సాఫీస్ దగ్గర జై సింహ సూపర్ హిట్గా నిలిచింది .. పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ గా మిగిలిపోయింది .. ఇలా 2018 సంక్రాంతి మాత్రం ప్రేక్షకులను అంతలా మెప్పించ లేకపోయిందని కూడా అంటారు .. ఇక ఇప్పుడు వచ్చే 2025 సంక్రాంతికి మాత్రం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ మామూలుగా లేదు .. బాల‌య్య‌ వర్సెస్ రామ్ చరణ్ వర్సెస్ వెంకటేష్ ఇలా ఈ ముగ్గురు బడా హీరోలు  ఈ సంక్రాంతి వార్‌లో నిలిచారు .. ఈ సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర ఎవరు విజేతగా నిలుస్తారనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: