కేజీఎఫ్ , సలార్ తో సెన్సేషన్ సృష్టించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ  గా నిలిచిన హోంబ‌లే ఫిలిమ్స్ ప్రొడక్షన్ సంస్థ .. కేవలం ఈ సినిమాల కారణంగానే హోంబ‌లే ప్రొడ‌క్షన్ సంస్థ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారని అందరికీ తెలిసిన విషయమే .. విజయ్ కిరంగుదురు , చలువే గౌడ , కార్తీక్ గౌడ .. వీరందరూ హోంబలే పుట్టుకకు కారణం .. తమ ఇలవేల్పు హోంబల అమ్మ పేరట హోంబలే ఫిలిమ్స్ అనే బ్యానర్ ను స్థాపించారు. దివంగత పునిత్ రాజ్‌కుమార్ తో మొదట నిన్నిందలే అనే సినిమాను నిర్మించారు హోంబ‌లే ప్రొడక్షన్స్ వారు .. కానీ నిన్నిందిలే సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది .. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును దివాలా తీసింది.  


ఇక తర్వాత మాస్టర్ పీస్ అనే సూపర్ హిట్ సినిమాతో హోంబలే ఫిలిం సంస్థ పేరు కన్నడ చిత్ర పరిశ్రమ లో హాట్ టాపిక్ గా మారి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది . ఆ తర్వాత కేజిఎఫ్ 1 , కేజీఎఫ్ 2 , కాంతారా  సినిమాలతో హోంబ‌లే ఫిలిమ్స్‌ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది .. ఇక 2023 లో ప్రభాస్ తో సలార్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ లో వర్షం కురిపించుకుంది .. ఇలా ఇండియన్ చిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్గా హోంబ‌లే సంస్థ ఎదిగింది .. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాలపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి ..

 

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఏకంగా ఈ సంస్థ నుంచి ఇప్పటికే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. అలాగే మ‌రో మూడు సినిమాలు కూడా ఈ సంస్థ‌తొ ప్రభాస్ చేయబోతున్నాడు ..  అలాగే ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్‌తో చేయబోయే డ్రాగన్ మూవీ కూడా ఈ ప్రొడక్షన్ హౌస్  నుంచే రాబోతుంది. ఇలా వరుసపాన్ ఇండియ‌ హీరోలందరూ హోంబలె సంస్థ‌ ఫిక్స్ చేసేసుకుంది . ఇక మరి రాబోయే రోజుల్లో ఈ సంస్థ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: