నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో శ్రీ లీల ముందు వరుసలో ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. ఎప్పటికప్పుడు వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ శ్రీలీల బిజీగా ఉంటుంది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు శ్రీలీలతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

బ్యూటీ చేసే సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటాయి. శ్రీలీల నటించిన తాజా చిత్రం పుష్ప-2. ఈ సినిమాలో ఈ బ్యూటీ కిస్సిక్ సాంగ్ లో అద్భుతంగా చిందులు వేసింది. ఈ అమ్మడు డాన్స్ చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఈ సినిమా అనంతరం శ్రీలీలకు స్పెషల్ సాంగ్ లలో నటించడానికి చాలా మంది దర్శకులు ఆఫర్ చేస్తున్నారట.

కానీ ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ లలో నటించను అంటూ ఖరాఖండిగా చెప్పేస్తుందట. కాగా శ్రీలీల ఎయిర్పోర్ట్ లో ఆమె తల్లితో కలిసి వెళుతున్నారు. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు శ్రీ లీలను ఫోటోలు తీస్తూ కిస్సిక్ స్టైల్ లో ఫోటో కావాలని మీడియా ప్రతినిధులు ఈ బ్యూటీని కోరారు. దాంతో శ్రీ లీల ఆ డ్యాన్స్ చేస్తే మా అమ్మ కొడుతుంది అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది.


ఆ డ్యాన్స్ మా అమ్మ చేయనివ్వడం లేదు అంటూ ఈ బ్యూటీ వెల్లడించింది. దీం తో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. కాగా టాలీవుడ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ, రవితేజ, నాగచైతన్య, అఖిల్ సినిమాలలో నటిస్తు న్నారని టాక్‌. చేతినిండా సినిమాలతో శ్రీ లీల ప్రస్తుతం బిజీగా ఉంది. తన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: