బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఛత్రపతి హిందీ సినిమాతో భారీ నష్టమే వచ్చిందట. తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి దర్శకులు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో వార్ సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా మన తెలుగు హీరో బాలీవుడ్ లో సినిమా చేసి బోల్తా కొట్టాడు. ఆయన ఎవరో కాదు బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా పరిచయమైన ఈ హీరోసినిమా అనంతరం వరసగా కొన్ని సినిమాలలో చేశాడు.


వాటిలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక సినిమా ఒకటి. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం అల్లుడు అదుర్స్ అనే సినిమా చేశారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వెళ్లారు. తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా చత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు.


ఈ సినిమాకు దర్శకత్వం వహించింది తెలుగు దర్శకుడు వివి వినాయక్ కావడం గమనార్హం. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పటికే రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన చత్రపతి సినిమా యూట్యూబ్ లో హిందీ లో డబ్ అయింది. అందరూ ఆ సినిమాను అప్పటికే చూసారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.


దాంతో హిందీ సినిమా చత్రపతి డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీలో కూడా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 12 మే, 2023లో థియేటర్ లో రిలీజ్ అయిన ఈ హిందీ చత్రపతి సినిమాపై తాజాగా బెల్లంకొండ సురేష్ సంచలన కామెంట్స్ చేశాడు. చత్రపతి హిందీ రీమేక్ 45-50 కోట్లు పెట్టి తీస్తే తియేట్రికల్ నుంచి 2.5-3 కోట్లు వచ్చాయని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నాడు. ఇతను చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: