టాలీవుడ్ సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది క్యాన్సర్ తో పోరాడుతూ 54 ఏళ్ల వయసులో మరణించారు .. ఆమె నటి , రచయిత , దర్శకురాలు అలాగే కొన్ని సినిమాలకు నిర్మాత గా కూడా వ్యవహరించారు . జనవరి 2వ తేదీ ఉదయం అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్ లో ఆమె చనిపోయారు . తెలుగు చిత్ర పరిశ్రమలో ది అను శ్రీ ఎక్స్పెరిమెంట్స్ అనే సినిమాతో తన సినీ జీవితం మొదలు పెట్టిన ఆమె తర్వాత  'పోష్ పోరిస్' అనే వెబ్ సిరీస్ కూడా తెరకెక్కించారు .. ఓటీటీలు ఇంతలా అభివృద్ధి చెందక ముందే తెర‌కెక్కించిన ఆ సిరీస్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది ..


ఆ సిరీస్ కి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి ..  ఆ తర్వాత రెండు సంవత్సరాల క్రితం ఆమె పెళ్లికూతురు పార్టీ అనే సినిమాను తెరకెక్కించారు .. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడటం తో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన ఆమె అప్పటినుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు . అయితే మొదట ట్రీట్మెంట్ కి బాడీ సహకరించిన ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ పనిచేయలేదని , క్యాన్సర్ తిరగబెట్టినట్టు తెలుస్తుంది .. ఈ క్రమంలోనే ఆమె చనిపోయినట్లు చెబుతున్నారు .. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాలను తెరమీదకు రావడానికి ఆమె కృషి ఎంతగానో ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారు ..


ఎంతో మంది నటులకు సినీ అవకాశాలు రావడానికి దర్శకులకు దర్శకత్వ అవకాశాలు రావడానికి ఆమె కారణమయ్యారని కూడా తెలుస్తుంది .. ఎంతో మంది దర్శకులను , నిర్మాతలను కూడా ఆమె కలిపి ఆ సినిమాలను పట్టాలెక్కించేవార ని  టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం .. అంతేకాకుండా ఆమె డైరెక్షన్లో మేలుకోలు కూడా పలువురు విద్యార్థులకు నేర్పించారు .. ఇప్పుడు అపర్ణ మల్లాది మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: