సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ప్రారంభమవుతాయి. అయితే ప్రారంభమైన సినిమాలు అన్ని థియేటర్ వరకు వస్తాయా అంటే చెప్పలేని పరిస్థితి. ప్రారంభమైన సినిమాలలో కేవలం 70 శాతం సినిమాలు మాత్రమే థియేటర్ వరకు వస్తాయి. మిగిలిన 30% సినిమాలు షూటింగ్ ప్రారంభమైన వెంటనే ఆగిపోవడం లేదా కొన్ని కారణాలవల్ల మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతాయి. ఈ క్రమంలోనే కొన్ని మాత్రం షూటింగ్ మొత్తం పూర్తయినా విడుదల కు మాత్రం నోచుకోవు. అలాంటి సినిమాలలో విశాల్ నటించిన మదగజరాజా ఒకటి.

దాదాపు 12 ఏళ్ల క్రితమే ఈ సినిమా ప్రారంభం అయింది.  షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.  కానీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.  అప్పట్లో విశాల్ కి జోడిగా అంజలి,  వరలక్ష్మి శరత్ కుమార్లు హీరోయిన్ లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టామని చెప్పారు.  కానీ సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఇకపోతే ఈ సినిమా గురించి అందరూ మరిచిపోతున్న సమయంలో అనూహ్యంగా సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని ప్రకటించారు.

తమిళనాట ఈ మధ్య విశాల్ మంచి ఫామ్ లో ఉన్నాడు ఆయన నటించిన సినిమాలు కూడా మినిమం గ్యారెంటీ అన్నట్టుగానే కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి.  ఇలాంటి సమయంలో ఈ సినిమాను విడుదల చేయడం వల్ల కచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు కలెక్షన్లు కూడా వస్తాయనే నమ్మకంతో నిర్మాతలు ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు.  ఇక విజయ్ ఆంటోని అప్పట్లో ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. సినిమాకు అప్పట్లోనే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.  కానీ విడుదల చేయకపోవడంతో ఇప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోవడంలేదని సమాచారం. సంక్రాంతికి రాబోయే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: