బాలయ్య బాబు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో, ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు 100 కోట్ల హ్యాట్రిక్ హిట్ కొట్టాడు బాలయ్య బాబు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మరో యాక్షన్ సినిమా NBK109 చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా బాగానే అంచనాలు ఉన్నాయి.ఇదిలావుండగా బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి అలరించారు.అయితే బాలకృష్ణ ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించారో తెలుసా.. తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవబుతుంది. రీమేక్ సినిమా చాలా మంది సూపర్ స్టార్ లకు బిగ్ బ్లాక్ బస్టర్స్ ను ఇచ్చాయి. అలాగే బాలకృష్ణ కు కూడా రీమేక్ సినిమాలు సూపర్ హిట్స్ ఇచ్చాయి. బాలయ్య చేసిన రీమేక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..బాలకృష్ణ రీమేక్ చేసిన మొదటి సినిమా నర్తనశాల.. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ సినిమాను బాలకృష్ణ రీమేక్ చేశారు. కానీ సౌందర్య చనిపోవడంతో ఆ సినిమాను ఆపేశారు. ఎప్పటికైనా ఆ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు బాలయ్య. హాలీవుడ్ టోటల్ రీకాల్ అనే సినిమాను ఆధారంగా తీసుకొని లయన్ అనే సినిమా చేశారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమాను పాండురంగడుగా రీమేక్ చేశారు. 

ది బౌర్నే ఐడెంటిటి అనే సినిమా ఆధారంగా విజయేంద్రవర్మ అనే సినిమా చేశారు. తమిళ్ లో విక్రమ్ నటించిన సామిని లక్ష్మీనరసింహ గా రీమేక్ చేశారు. కన్నడలో రాజ నరసింహ సినిమాను తెలుగులో పల్నాటి బ్రహ్మనాయుడు గా రీమేక్ చేశారు. హిందీలో వచ్చిన హీరో నంబర్ 1 సినిమాకు రీమేక్ గా గొప్పింటి అల్లుడు చేశారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న శ్రీకృష్ణ పాండవీయం సినిమాను.. శ్రీ కృష్ణార్జున విజయం గా బాలయ్య రీమేక్ చేశారు. అలాగే పాతాళ భైరవి,  ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరునికథ’, ‘రాజపుత్ర రహస్యం’లాంటి సినిమాల కథను ఆధారం చేసుకొని భైరవ ద్వీపం సినిమా చేశారు. అలాగే తంగమన రాసా’ సినిమాకు రీమేక్ గా ముద్దుల మేనల్లుడు, ఆర్యన్ సినిమాకు రీమేక్ గా అశోక చక్రవర్తి, ఎన్ తంగాచ్చి పడిచావా సినిమాకు రీమేక్ గా ముద్దుల మామయ్య, సీనియర్ ఎన్టీఆర్ రాముడు భీముడు, అరువదై నాల్ సినిమా మువ్వగోపాలుడు గా రీమేక్ చేశారు.

పెర్ సొల్లుమ్ పిళ్లై’ – రాము, ఖయామత్ -నిప్పులాంటి మనిషి, వద్దంటే డబ్బు- బాబాయి అబ్బాయి, కర్జ్ – ఆత్మబలం, మన్ వాసనై -మంగమ్మగారి మనవడు , డిస్కో డాన్సర్- డిస్కో కింగ్, ఆషా – అనురాగదేవత, ఎన్టీఆర్ వేంకటేశ్వర మహాత్యం- శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, నర్తనశాల-శ్రీ మద్విరాట పర్వము, ‘మెఘల్ – ఏ – ఆజం -అక్బర్ సలీం అనార్కలి, యాదోంకి బారాత్- అన్నదమ్ముల అనుబంధం ఇలా చాల రీమేక్స్ బాలయ్య నటించారు.అలాగే ఇప్పుడు తాజాగా మలయాళంలో ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ‘ఆవేశం’ సినిమా ను బాలకృష్ణ రీమేక్ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రౌడీ రంగ పాత్రలో బాలయ్య నటిస్తాడని అంటున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనడానికి ప్రయత్నిస్తుందట. ఇదే నిజమైతే బాలయ్యని ఫుల్ యాక్టివ్ గా మరో కొత్త పాత్రలో చూడొచ్చు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: