తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా కంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రేణు దేశాయ్.. ముఖ్యంగా ఈమె పిల్లలు విషయంలో తరచూ అభిమానులు తెగ వైరల్ గా చేస్తూ ఉంటారు.ఈమె పొలిటికల్ పరంగా మాట్లాడడం చాలా తక్కువ ముఖ్యంగా తన కుటుంబానికి సంబంధించిన విషయాలను.. పలు రకాల సేవ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటుంది రేణు దేశాయ్.. అయితే ఈ రోజున సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ నిర్వహించినటువంటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంలో రేణు దేశాయ్ పాల్గొనింది.



ఈ కార్యక్రమంలో రేణు దేశాయ్ మాట్లాడుతూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మహిళలు విద్య కోసం పోరాడినటువంటి వారిలో సావిత్రిబాయి పూలే కృషి చాలానే ఉన్నదంటూ తెలిపింది. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం గురించి మాత్రమే చెబుతున్నానంటూ తెలిపింది. తాను అందరి ముందు మాట్లాడుతున్నాను అంటే అందుకు గల కారణ సావిత్రిబాయి పూలే అంటూ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు కుటుంబంతో కంటే ఎక్కువగా ఉపాధ్యాయులతోనే సమయాన్ని గడుపుతూ ఉంటారు. అందుకే వారిని సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుల పైన ఉంటుంది అంటూ తెలిపింది రేణు దేశాయ్.


రేణు దేశాయ్ కి రాజకీయాలు అంటే తనకు ఇష్టం లేదని కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం చాలా ఇష్టమని తెలిపింది.అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం కూడా రావడం జరిగిందట .అలాగే బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తో పాటు పలువురు ప్రొఫెసర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని తేల్చి చెప్పేసింది.. కేవలం తన పిల్లలు కుటుంబం గురించి తాను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: