తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన బాయ్స్ మూవీ తో తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమాను తెలుగు లో డబ్ చేసి విడుదల చేయగా ఈ మూవీ తమిళ్ కంటే కూడా తెలుగు లో మంచి విజయం సాధించడంతో సిద్ధార్థ్ కి ఈ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన అనేక తెలుగు సినిమాలలో నటించాడు. అందులో భాగంగా 2005 వ సంవత్సరంలో ఈయన హీరో గా రూపొందిన నువస్తానంటే నేనొద్దంటానా సినిమా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాలో సిద్ధార్థ్ ను ప్రేమిస్తూ అతని వెంట తిరుగుతూ ఒక అమ్మాయి ఉంటుంది  ఆ అమ్మాయి సిద్ధార్థ్ , త్రిష ను ప్రేమిస్తున్నాడు అని తెలిసిన సిద్ధార్థ్ ను తన వశం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక ఆమె ఆ సినిమాలో తన నటనతో పాటు అందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ ముద్దుగుమ్మ అసలు పేరు నందిత జర్నీ ఫర్. ఇకపోతే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాలు చేయలేదు.

కానీ ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అవి సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. ఇలా నువోస్తానంటే నేనొద్దంటానా మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: