టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ మధ్యకాలంలో పెళ్లి విషయాలు, ప్రెగ్నెంట్ విషయాలు , లవ్, బ్రేకప్ విషయాలు తెలియజేస్తూ ఉన్నారు.. అయితే ఇప్పుడు తాజగా టాలీవుడ్ హీరోయిన్ ఏకంగా వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సాక్షి అగర్వాల్.. ఈమె రాజా రాణి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది ఆ తర్వాత.. కాలా, టెడ్డీ వంటి చిత్రాలలో కూడా నటించింది. అయితే పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ గా కూడా నటించిందట.



పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఈమె తెలుగు, కన్నడ, తమిళ్ వంటి భాషల్లో కూడా నటించడమే కాకుండా పలు రకాల రియాలిటీ షోలలో  కనిపించడమే కాకుండా బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకుందట. ఈమె చివరిగా నటించిన చిత్రం బఘిర. ఈ సినిమా తర్వాత ఇమే ఇండస్ట్రీకి దూరమైన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. అయితే తాజాగా సైలెంట్ గా వివాహం చేసుకొని సాక్షి అగర్వాల్ అందుకు సంబంధించి ఫోటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


సాక్షి అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన నవనీత్ తో ప్రేమాయణం నడిపి ఏడడుగులు వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక ఎమోషనల్ కొటేషన్స్ సైతం షేర్ చేసింది.. వివాహం తర్వాత అంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేసి ఒక వీడియోను కూడా తెలియజేయడంతో సోషల్ మీడియాలో పలువురు అభిమానులు నెట్టిజెన్స్ సెలబ్రెటీలు సైతం  ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏంటి సాక్షి ఇలా షాక్ ఇచ్చావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఫేడౌట్ అవుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని మంచి పని చేశారంటూ మరి కొంతమంది ఆమెకు సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: