హీరోయిన్ గౌతమి, కమల్ హాసన్ తో విడిపోవడానికి గల కారణాలను యాంకర్ అడగగా?.. గౌతమి ఇలా మాట్లాడుతూ కమలహాసన్, నాది చాలా సెన్సిటివ్ రిలేషన్షిప్ అని కానీ తామిద్దరం విడిపోవడం కూడా ఒక సెన్సేషనల్ బ్రేకప్ అని వెల్లడించింది. అయితే తమ రిలేషన్ లో వేరే వారు ఎవరూ కూడా ఎంట్రీ లేదని.. ఒకవేళ అలాంటి వ్యక్తి వస్తే అది రిలేషన్ కాదు అని.. ఒక రిలేషన్ అంటేనే లైన్ గా ఇద్దరు కలిసి నడవడం.. అలాంటిది అపోజిషన్ డైరెక్షన్లో ప్రయాణిస్తే అక్కడ ప్రేమ ఉంటుందా అసలు ఉండదు అంటూ ఆమె వివరించింది.
అయితే చిన్న చిన్న కారణాలవల్ల బ్రేకప్లు జరిగాయి. వాటిని మోస్తూ తాను జీవితాంతం గడపలేను..అలా చేయకపోతే తాను ముగ్గురికి అన్యాయం చేసిన దానిని అవుతానని ఒకటి తన కూతురికి ఇలాగే బ్రతకాలని పరోక్షంగా కూడా తెలియజేశానని తెలిపింది గౌతమి. మరొకటి తనని తాను మోసం చేసుకుంటున్నానని తన జీవితాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారని.. ఎలాంటి బాధలను కూడా దరికి చేరనివ్వకుండా జీవించాలనుకున్నానని తెలిపింది. తన తల్లి నేర్పిన విషయాలు సంపూర్ణ అర్థం ఉండాలి అంటే ఇలాంటి బాధలను భరించకపోవడం మంచిదని అందుకే బ్రేకప్ చేసుకున్నానని తెలిపింది. ప్రస్తుతమైతే తాను సరైన మార్గంలో వెళుతున్నానని తెలిపింది.. ఇటీవలే పలు చిత్రాలలో కూడా రీ ఎంట్రీ ఇచ్చి నటిస్తోంది గౌతమి.