టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లోనే కాకుండా ఇటు సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు నందమూరి బాలయ్య. అలా ఇప్పటికే... హిందూపురం ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన నందమూరి బాలయ్య... ఇటు సినిమాలలో ప్రతి సినిమా హిట్ కొట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో... ఈ సంక్రాంతికి డాకు మహారాజు సినిమాతో వస్తున్నాడు నందమూరి బాలయ్య.


సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. అంటే జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా.... డాకు మహారాజు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక రిలీజ్ సమయానికి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో... స్వయంగా నందమూరి బాలయ్య రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు నందమూరి బాలయ్య.

మొత్తం మూడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఒకటి డల్లాస్ లో ఇవాళ జరిగితే... ఈనెల ఏడో తేదీన హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించనున్నారు. మరొకటి 9వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  ఫ్రీ రిలీజ్ ఈవెంట్  ఉంటుంది. ఇక ఇవాళ డల్లాస్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న నందమూరి బాలయ్యకు ఘన స్వాగతం అందింది. అయితే ఇవాళ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్న నేపథ్యంలో.. నందమూరి బాలయ్య ఫ్యాన్స్ డల్లాస్ లో రచ్చ చేశారు.


బాలయ్య కోసం ఆయన ఫ్యాన్స్ భారీ కార్ల ర్యాలీ కూడా తీశారు. NBK అనే పేరు వచ్చేలా కార్లను ఏర్పాటు చేసి రచ్చ చేశారు. అలాగే కార్ల పైన బాలయ్య ఫోటోలను తగిలించుకొని ర్యాలీ కూడా తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా.... ఈ సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేస్తున్న నేపథ్యంలో శ్రద్ధ శ్రీనాథ్ అలాగే ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా ఉన్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: