సంక్రాంతి వచ్చిందంటే చాలు పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో హడావిడి చూపిస్తాయి.. అలా ఇప్పటివరకు సంక్రాంతి బరిలో నిలిచిన చాలామంది హీరోలు స్టార్లుగా నిలిచారు. ఇక ఎక్కువ సార్లు పోటీ పడింది బాలకృష్ణ,చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు మాత్రమే. ఈ హీరోలు తమ సినిమాలు కచ్చితంగా సంక్రాంతిగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే సినిమా నిర్మించాలంటే నిర్మాత తప్పనిసరి. సినిమా నిర్మాణం కోసం ఎన్ని డబ్బులు అయినా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కలెక్షన్ల రూపంలో నిర్మాతకి పెట్టిన బడ్జెట్ వస్తుంది. సినిమా బాగుంటే రెట్టింపు కలెక్షన్స్ వస్తాయి.కానీ సినిమా ఎక్కడ తేడా కొట్టినా కూడా నిర్మాత తట్టా బుట్టా సర్దుకోవడమే. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది నిర్మాతలు తీసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఇండస్ట్రీ నుండే వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి..అయితే ఇప్పటివరకు ఉన్న నిర్మాతలలో దిల్ రాజు ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దన్నగా కొనసాగుతున్నారు.మరి అలాంటి దిల్ రాజు ఇప్పటివరకు ఎన్ని సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం..

 మొదట డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీ రంగంలోకి అడుగుపెట్టిన దిల్ రాజు ఆ తర్వాత నిర్మాతగా మారారు.ఇక ఆయన చేసిన దిల్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో దిల్ రాజుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే అలాంటి దిల్ రాజు ఇప్పటివరకు సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ చేశారంటే.. మొదటిది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఈ సినిమాతో మొదటిసారి దిల్ రాజు తాను నిర్మించిన సినిమాని సంక్రాంతికి విడుదల చేశారు. ఈ సినిమా జనవరి 11,2013లో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. వెంకటేష్ మహేష్ బాబుల మల్టీస్టారర్ మూవీ అదరహో అనిపించింది.ఆ తర్వాత శర్వానంద్ అనుపమ కాంబోలో వచ్చిన శతమానం భవతి మూవీ 2017 జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఇక 2019లో వెంకటేశ్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ఎఫ్2 కూడా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ షేక్ చేసింది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులతో నవ్వులు పోయించారు వెంకీ అండ్ వరుణ్.


సినిమా దిల్ రాజు కి  ఎన్నో లాభాలు తెచ్చిపెట్టింది. ఇక మహేష్ బాబు రష్మిక కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా 2020 జనవరి 11న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం అందుకుంది. ఇక 2022 జనవరి 14న దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో అనుపమ చాలా బోల్డ్ గా నటించింది. ఇక తమిళ హీరో విజయ్ దళపతి రష్మిక మందన్నా హీరో హీరోయిన్స్ గా చేసిన వారిసు తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ అయింది.ఈ సినిమా 2023 జనవరి 14న విడుదలై మంచి కలెక్షన్లు అందుకుంది. ఇక 2025లో దిల్ రాజు నిర్మాతగా చేస్తున్న గేమ్ చేంజర్,సంక్రాంతి వస్తున్నాం వంటి రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలబోతున్నాయి.ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ హైప్ ఉంది.మరి ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి కాబట్టి ప్రేక్షకులను ఏ విధంగా అలరించబోతున్నాయో చూడాలి. అలా దిల్ రాజు ఇప్పటివరకు సంక్రాంతికి ఎన్నో సినిమాలతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.. సంక్రాంతి అంటే దిల్ రాజు దిల్ రాజు అంటే సంక్రాంతి అనేలా పేరు తెచ్చుకున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: