హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం మూవీ రికార్డ్స్ రోజుకొకటీ బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే 28 రోజులకు పైగా ప్రపంచవ్యాప్తంగా రూ .1799 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఇక బాలీవుడ్లో అయితే పుష్ప 2 సినిమా మానియా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది. పలు రకాల రికార్డులు కూడా సృష్టిస్తూ ఉన్నది ఈ చిత్రం. ఇప్పుడు తాజాగా పుష్ప 2 సినిమా బాలీవుడ్ లో ఒక రికార్డును నెలకొల్పింది..


అదేమిటంటే ఇప్పటివరకు హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల రికార్డులు నిలిచింది. 800 కోట్లకు అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది పుష్ప 2 చిత్రం. నాలుగు వారాలలో ఈ సినిమా స్టడీగానే ముందుకు వెళుతొందట. నాలుగో వారంలో 57.95  కోట్లను రాబట్టిందట ఈ విషయాన్ని ప్రముఖ సిని విశ్లేషకుడు అయినా తరుణ్ ఆదర్శ తమ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.పుష్ప సినిమా నాలుగు వారాలలో 798.20 కోట్ల నెట్టు వసూళ్లను సాధించిందని. నిన్నటితో ఈ సినిమా 800 కోట్ల రూపాయల క్లబ్బులు అడుగుపెట్టడం ఖాయమని తెలియజేశారు.


సుకుమారు డైరెక్షన్లో రష్మిక హీరోయిన్గా సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్  కాంబినేషన్లో ఈ సినిమా విడుదల అయింది. మొత్తానికి అల్లు అర్జున్ బాలీవుడ్లో పుష్ప 2 సినిమాతో ఒక సరికొత్త రికార్డును సృష్టించి 800 కోట్ల లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి చిత్రంగా నిలిచింది. బాహుబలి2 రికార్డులను కూడా త్వరలోనే అధికమించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. మరి ఏమి అరకు ఎలాంటి రికార్డులను రాబోయే రోజుల్లో పుష్ప 2 సినిమా అధికమిస్తుంది చూడాలి. అల్లు అర్జున్ కు ఒకవైపు ఇబ్బందులు ఎదురవుతున్న మరొకవైపు పుష్ప 2 సినిమా రికార్డుల వేట కొనసాగుతూనే ఉన్నది. ఇక తదుపరిచిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: