తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ గతేడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాత కాగా హనుమాన్ మూవీ సక్సెస్ తో ఈ నిర్మాతకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయి. హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి హిట్ కావడంతో నిర్మాత నిరంజన్ రెడ్డి పేరు కూడా మారుమ్రోగింది.
 
హనుమాన్ మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధించింది. హనుమాన్ సినిమాలో ట్విస్టులు అద్భుతంగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జై హనుమాన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
 
జై హనుమాన్ సినిమాను మాత్రం మైత్రీ నిర్మాతలు నిర్మించనున్నట్టు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం. ప్రశాంత్ వర్మ కెరీర్ విషయానికి వస్తే ఈ దర్శకుడి తర్వాత సినిమా మోక్షజ్ఞ హీరోగా తెరకెక్కనుంది. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ టాలీవుడ్ ను షేక్ చేసే కాంబినేషన్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.
 
జనవరి నెలలో ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ మూవీతోనే మోక్షజ్ఞ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి సినీ అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాల విషయంలో నందమూరి  మోక్షజ్ఞ కెరీర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: