అల్లు అర్జున్ కి తాజాగా నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆయన ఇన్ని రోజులు మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. ఇక తాజాగా జనవరి మూడున నాంపల్లి కోర్టులో ఈయన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. కానీ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ కి ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ బెయిల్ రాకూడదు అని గట్టిగానే ప్రయత్నించారు. కానీ అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గట్టిగా వాదించడంతో ఆయనకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది.అయితే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ రావడానికి డబ్బులు పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది.ఇక ఈ డబ్బులతో చిన్నపాటి సినిమాను కూడా తీసేయొచ్చు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ అల్లు అర్జున్ తనకి రెగ్యులర్ బెయిల్ రావడం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.

అల్లు అర్జున్ పుష్పటు సినిమా రిలీజ్ అయిన సమయంలో సంధ్య థియేటర్ దగ్గరికి అనుమతి లేకుండా వెళ్లడం రోడ్ షో చేయడంతో అక్కడ ఆయన్ని చూడడానికి అభిమానులు అందరూ ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చారు. దాంతో ఫ్యామిలీతో కలిసి వచ్చిన రేవతి కుటుంబంలో ఆ తొక్కిసలాటలో జనాల కాళ్ళ కింద పడిపోయింది  అలాగే ఊపిరాడక రేవతి మరణించింది. ఆమె కొడుకు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు.ఇప్పటికి కూడా ఆయన కోలుకోలేదు. ఇక ఈ ఘటనలో అల్లు అర్జున్ ని A11 గా పేర్కొన్నారు పోలీసులు.దీంతో అల్లు అర్జున్ ఒకరోజు జైలుకు వెళ్లి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయనకు మద్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఇన్ని రోజులు సైలెంట్ అయిపోయారు.ఇక మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు.

ఇక ఈ రెగ్యులర్ బెయిలు కూడా కోర్టు మంజూరు చేయడంతో ఈయనకు సినిమా షూటింగ్స్ చేసుకోవడం సులభంగా మారిపోయింది. ఎందుకంటే ఓ సినిమా అయిపోవడంతోనే మరో సినిమా పనిలో పడతారు హీరోలు. కానీ అల్లు అర్జున్ పై కేసు ఉండడంతో ఆయన సినిమా షూటింగ్లో పాల్గొనలేక పోతున్నారు.ఇక ఎట్టకేలకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు.అలాగే ప్రతి ఆదివారం చికడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి హాజరవ్వాలని రెండు నెలల పాటు ఇలా ప్రతివారం చేయాలి అంటూ కోర్టు షరతు విధించింది. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ రావడం కోసం దాదాపు 5కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది.డబ్బుల కారణంగానే అల్లు అర్జున్ బయటపడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. అలా బెయిల్ కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టారు అనే విషయం తెలియడంతో చాలా మంది నెటిజెన్లు ఆ డబ్బులతో ఓ చిన్నపాటి సినిమా తీసేయొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: