మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా కోసం తెలుగులోనే కాదు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ బజ్‌ కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం దర్శ‌కుడు శంకర్. శంక‌ర్‌ బ్రాండ్ తో పాటు పొంగల్ కు చెప్పుకోదగ్గ పాన్‌ ఇండియా సినిమా అనేది ఏదీ లేదు. దీంతో మీడియా అటెన్షన్ సహజంగానే గేమ్ ఛేంజర్ సినిమా మీద ఎక్కువగా ఉంది. దీనికి తోడు నిర్మాత దిల్ రాజు చెన్నైలో ప్లాన్ చేసుకున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టులు గా రజనీకాంత్ - విజయ్‌ను ఆహ్వానించారని వస్తున్న వార్త ఇప్పుడు కోలీవుడ్లో బాగా హాట్‌ టాపిక్ అయింది. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు లేదా కనీసం ఇద్దరిలో ఒక్కరు వచ్చిన సినిమాకే అది మంచి బూస్టర్ అవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇది ఖరారు కావాలంటే ఈ రోజుతో క్లారిటీ వస్తుంది.


ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ టాపిక్ కూడా ఉంది. గేమ్ ఛేంజర్ కథ‌ ముందుగా శంకర్ త‌మిళ‌ హీరో .. కోలీవుడ్ ఇళ‌య‌ దళపతి విజయ్ తో చేయాల‌ని అనుకున్నాడ‌ట‌.. కానీ కుదరలేదు. ఈ కాంబినేషన్లో త్రీ ఇడియట్స్ సినిమాకు రీమేక్‌గా స్నేహితుడు వచ్చింది కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు. స్ట్రెయిట్ సబ్జెక్టు ఏదైనా చేసి ఉంటే బాగుండేదని అప్పట్లో విజయ అభిమానులు కూడా తెగ ఫీలయ్యాయ్యారు. ఆ టైంలోనే కార్తీక్ సుబ్బరాజు ఒక కథ రాసుకొని శంకర్ కు వినిపించడం .. అది విజ‌య్ ఓకే చేయ‌టం జరిగిపోయాయి. స్టోరీ నచ్చిన కూడా విజయ్ గ్రీన్స్ సిగ్న‌ల్‌ ఇవ్వలేకపోయాడు. దీని స్థానంలోనే బీస్ట్ ఒప్పుకున్నాడు.


అలా చేయి మారి పోయి దిల్ రాజు ద్వారా శంకర్ రామ్ చరణ్ ని కలుసుకోవడం .. వెంటనే చరణ్ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పటం చక చక జరిగిపోయాయి. ఒకవేళ విజయ కనక గేమ్ ఛేంజర్ చేసి ఉంటే త‌న రాజకీయ తెరంగ్రేటానికి ముందు చేయాల్సిన సరైన సినిమాగా నిలిచిపోయి ఉండేది. కానీ జరిగింది వేరు .. ఇక మూడేళ్లు నిర్మాణంలో ఉన్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం విజయ్ అంత టైం కేటాయించేవాడు కాదు. ఇదిలా ఉంటే అజిత్ విడామయూర్చి సినిమా వాయిదా పడటంతో ఆ ఆనందంతో విజయ్‌ అభిమానులు గేమ్ ఛేంజ‌ర్ సినిమాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు తమిళ సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: