సీనియర్ నటి రాధిక.. అందం అభినయంలో తనకు తానే సాటి అన్నట్లుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన రాధిక అప్పట్లో టాలీవుడ్ లో చిరంజీవికి హిట్ పెయిర్ గా నిలిచింది.రాధిక చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాయి.అలా చిరంజీవి రాధికల కెమిస్ట్రీ బాగుండడంతో హిట్ పెయిర్ గా టాలీవుడ్ లో వీరి జోడి కి మంచి పేరుంది.అయితే అలాంటి సీనియర్ నటి రాధిక చీర కుచ్చులలో ఓ హీరో చేయి పెట్టారట.దాంతో కోపంతో రాధికహీరో చెంప చెల్లుమనిపించిందట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది చూస్తే..ఎన్నో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా మెప్పించిన సుధాకర్ మొదట్లో కోలీవుడ్లో పెద్ద హీరో అనే సంగతి మనకు తెలిసిందే.ఈయన కోలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా చేసి హిట్ కొట్టారు.ఇక ఈయన స్టార్డం ఓర్వలేని కొంతమంది కావాలనే సుధాకర్ కి అవకాశాలు రాకుండా చేసి తెలుగు ఇండస్ట్రీకి పారిపోయేలా చేశారట.

 కానీ సుధాకర్ ని ఎవరూ అడ్డుకోకపోతే ఆయన కోలీవుడ్  లో అతిపెద్ద స్టార్ గా రజినీకాంత్, కమల్ హాసన్ లాగా ఎదిగే వారని అప్పటి సినీ ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఆయనకు అవకాశాలు రాకుండా చేయడంతో తమిళంలో అవకాశాలు లేక తెలుగులో కమెడియన్ పాత్రలు చేయాల్సి వచ్చింది. అయితే తమిళంలో హీరోగా చేస్తున్న సమయంలో రాధిక సుధాకర్ కాంబినేషన్లో ఏకంగా 12 సినిమాలు వచ్చాయి. దాంతో వీరి మధ్య ఎఫైర్ నడుస్తుందని,వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో సుధాకర్ మాట్లాడుతూ.. నేను చాలా సినిమాల్లో రాధికతో కలిసి నటించాను.దాంతో మా ఇద్దరి మధ్య ఎఫైర్ వార్తలు వినిపించాయి. 
కానీ మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం లేదు. ఇక మొదట్లో నేను రాధికతో ఓ సినిమాలో చేస్తున్న సమయంలో సినిమాలో భాగంగా ఆమెను పైకి ఎత్తుకోవాల్సిన సన్నివేశం ఉంటుంది.అలా ఆమెను పైకి ఎత్తుకున్న సమయంలో రాధిక చీర కుచ్చులలోకి నా చేయి దూరింది. అది పొరపాటున దూరింది. కానీ రాధిక నన్ను తప్పుగా అర్థం చేసుకొని షాట్ అయిపోవడంతోనే నా చెంప చెల్లుమనిపించింది. అందరి ముందే కొట్టడంతో నాకు చాలా బాధేసింది. ఆ తర్వాత రాకెట్ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పాను.దాంతో అర్థం చేసుకుని రాధిక సారీ చెప్పింది.ఆ తర్వాత మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడి వరుస సినిమాలు చేశాము. కానీ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తప్ప వేరే సంబంధం మాత్రం లేదు అంటూ సుధాకర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: