టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందిన ప్రగ్యా జైస్వాల్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. అందం అభినయం ఉన్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. కానీ సినిమా అవకాశాలను మాత్రం అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంలో నటించడంతో మరొక విజయాన్ని అందుకుంది. అయితే ఈ సక్సెస్ రావడానికి చాలా ఏళ్లు పట్టిందని చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగినప్పటికీ బడా బ్యానర్లో అవకాశాలు అందుకోలేకపోవడంలో వెనుకబడిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ తో బ్లాస్ట్ అయ్యేలా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.


గతంలో ఎన్నో చిత్రాలలో నటించిన ప్రగ్యా ఐరన్ లెగ్ హీరోయిన్గా ముద్ర పడిపోవడంతో చాలామంది ఈమెకు అవకాశాలు ఇవ్వలేదు. మళ్లీ టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో బాలయ్యతో మరొక సినిమా నటించే అవకాశం రావడంతో ఈమెకు బాలకృష్ణ అనే అవకాశాలు ఇప్పిస్తున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు డాకు మహారాజు లో కూడా నటించడమే కాకుండా అఖండ 2లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య వల్లే ఈమెకు అవకాశాలు వస్తున్నాయని ప్రశ్న ఆమె వద్దకు వెళ్లడంతో ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చింది.


బాలయ్య మాత్రం తనకు ఎలాంటి రిఫరెన్సులు ఇవ్వలేదని డైరెక్టర్ బాబి కారణంగానే డాకు మహారాజు లో తనకు అవకాశం వచ్చింది అంటూ వెల్లడించింది.. కదలే తన దగ్గరకు వచ్చాయని.. తాను వాటి దగ్గరికి ఎప్పుడు వెళ్ళనని తెలిపింది. తనకు ఇప్పటివరకు జరిగిన సినీ కెరియర్ అంతా కూడా ఇలాగే జరిగిందని డాకు మహారాజులో తన పాత్ర తెరపై చూసేందుకు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని వెల్లడించింది ప్రగ్య.. కంచె సినిమాతో మొదటిసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ఒకవైపు బాలీవుడ్ టాలీవుడ్లలో సినిమాలలో నటిస్తూ ఉన్నది ప్రగ్యా జైస్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: