![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/gopichand-f34269b5-12ae-47d5-b2e4-6e788aaa20a9-415x250.jpg)
ఆ తర్వాత తేజ దర్శకత్వంలో జయం .. ఆ తర్వాత వర్షం సినిమాలో విలన్గా చేసి తన నటనలో మరో కోణాన్ని చూపించాడు. కెరీయర్ పరంగా గోపీచంద్ కు బ్రేక్ ఇచ్చింది మాత్రం యజ్ఞం. ఆ తర్వాత రణం సినిమా ... ఆంధ్రుడు కూడా బాగా ఆడాయి. కొద్దిరోజులుగా ఆక్సిజన్ - ఆరడుగుల బుల్లెట్టు - చాణక్య - పంతం లాంటి అతిపెద్ద డిజాస్టర్లు గోపీచంద్ ఖాతాలో పడ్డాయి. మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమాతో కూడా నిరాశపరిచాడు. అసలు గోపీచంద్ కు సినిమాల్లోకి రావడం ఎంత మాత్రం ఇష్టం లేదట. తండ్రి ఒకప్పుడు డైరెక్టర్ ... గోపీచంద్ అన్న ప్రేమ్చంద్ కూడా డైరెక్టర్. ఒకటి రెండు సినిమాల కు ప్రేమ్చంద్ డైరెక్టర్గా పనిచేశాడు. ప్రేమ్‌చంద్ యాక్సిడెంట్లో కన్నుమూశాడు. తన కుటుంబం నుంచి ఇండస్ట్రీలో ఒక్కరైనా ఉండాలని తండ్రికి బలంగా కోరిక ఉండేదట. ఆ కోరిక కారణంగానే గోపీచంద్ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి హీరోగా సెటిల్ అయిపోయాడు.