![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/director-rgvs-comments-viral63ab7c9d-e532-4ae6-8fcc-c155f82efd3b-415x250.jpg)
వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ డేట్లు అడిగినా జాన్వీ కపూర్ ఇచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పవచ్చు. ఒక ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పదహారేళ్ల వయసు, వసంత కోకిల సినిమాలలో శ్రీదేవి ప్రదర్శన అద్భుతంగా ఉంటుందని వర్మ కామెంట్లు చేశారు. శ్రీదేవి యాక్టింగ్ చూసిన తర్వాత నేను ఫిల్మ్ మేకర్ ననే విషయాన్ని సైతం మరిచిపోయానని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.
శ్రీదేవిని ఒక ప్రేక్షకుడిగా నేను చూస్తూ ఉండిపోయానని ఆయన కామెంట్లు చేశారు. అది శ్రీదేవి స్థాయి అని వర్మ వెల్లడించారు. ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్ లో నేనొక ఫిల్మ్ మేకర్ ననే విషయం మరిచిపోయానని ఆయన పేర్కొన్నారు. శ్రీదేవిని ఒక ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయానని చెప్పుకొచ్చారు. అది ఆమె స్థాయి అని రామ్ గోపాల్ వర్మ స్థాయి అని కామెంట్లు చేశారు.
శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దఢక్ అనే సినిమాతో జాన్వీ కపూర్ కెరీర్ మొదలు కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన పలు సినిమాలలో ఆమె నటించారు. తెలుగులో దేవర అనే సినిమాలో నటించిన జాన్వీ ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ భవిష్యత్తు సినిమాలతో సక్సెస్ సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వర్మ కామెంట్లపై జాన్వీ కపూర్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.