స్టార్ హీరోయిన్ రష్మికకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు... ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన హీరోయిన్ రష్మిక టాలీవుడ్ లో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించింది. ఛలోతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ గీత గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈమె కన్నడ భామ.. అక్కడ కిర్రాక్ పార్టీతో సినీ ప్రయాణం మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు పెళ్లి వరకు వెళ్లి వెనుదిరిగింది. కిర్రాక్ పార్టీ సినిమా సమయంలోనే రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది.. వీరిద్దరూ 2017లో ఎంగేజ్‍మెంట్ కూడా చేసుకున్నారు.ఇదిలావుండగా సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాదిని ఆనందంగా ఆహ్వానించారు. పాత జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని, కొత్త సంవత్సరం తెచ్చే అనుభూతుల కోసం ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మన నేషనల్ క్రష్ రష్మిక కూడా తన లైఫ్ లో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను..' మీ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం ఏది?' అని అడగ్గా.. దీనికి శ్రీవల్లి బదులిస్తూ.. తన జీవితంలో ముఖ్యమైన ఓ రోజును గుర్తు చేసుకుంది. ' 2016 డిసెంబర్ 30.. నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమైన రోజు. అప్పుడే నా తొలి సినిమా ‘కిరాక్ పార్టీ’ విడుదలైంది. ఆ సినిమా నా జీవితం మొత్తం మార్చేసింది. ఆ సినిమాతోనే నేను కన్నడ పరిశ్రమలో బిజీ అయ్యాను. ఇక, నా టాలీవుడ్ ఫస్ట్ మూవీ ‘చలో’ అవకాశం కూడా ‘కిరాక్ పార్టీ’ వల్లే వచ్చింది. ఆ సినిమా చూసి, నన్ను ‘చలో’లోకి ఎంపిక చేశారు. అప్పటి నుంచి నా కెరీర్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అందరూ నన్ను ‘నేషనల్ క్రష్’ అని పిలుస్తున్నారంటే, దానికి పునాది ‘కిరాక్ పార్టీ’నే.." అని తెలిపింది.ఇక గత నెలలో రిలీజైన 'పుష్ప2' తో మరో పాన్ ఇండియా సక్సెస్ ను సొంతం చేసుకుంది రష్మిక. సినిమాలో శ్రీవల్లీ పాత్రలో రష్మిక నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: