నాగేశ్వరరావు..ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉంది అన్న పాన్ ఇండియా లెవెల్ లో మన తెలుగు హీరోలు గుర్తింపు సంపాదించుకుంటున్నారు అన్న దానికి కారణం నాగేశ్వరరావు గారు.. అదేవిధంగా ఎన్టీరామారావు గారు అని చెప్పడంలో సందేహమే లేదు. వాళ్ళిద్దరే టాలీవుడ్ కి పిల్లర్స్ లా నిలబడి టాలీవుడ్ ని ముందుకు తీసుకొచ్చారు.  ఆ విషయం అందరికీ తెలుసు . కాగా నాగేశ్వరరావు గారికి చిన్నప్పటి నుంచి ఒక హాబిట్ ఉండేదట .


ఆయన ఎక్కువగా డైరీ రాసుకునే అలవాటు ఉందట . ఆయన చనిపోయే ముందు వరకు కూడా ఆయన డైరీ రాసుకుంటూనే వచ్చారట . అలా అక్కినేని నాగేశ్వరరావు గారు తన లైఫ్ లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ని డైరీలో రాసుకునే వారట . మరి ముఖ్యంగా సావిత్రి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ అదేవిధంగా సావిత్రి గారితో నటించే మూమెంట్లో జరిగిన ఫన్నీ ఫన్నీ సీన్స్ అన్నీ కూడా ఆయన .. ఆయన డైరీలో రాసుకున్నారట. అంతేకాదు ఆయన సరదాగా గడిపిన మూమెంట్స్ కి సంబంధించిన విషయాలని సైతం ఆ డైరీలో రాసుకున్నారట. ఇదే మూమెంట్లో ఆమెతో దిగిన ఫోటోని సైతం డైరీలో పధిలంగా దాచుకొని ఉన్నారట .



అంతేకాదు మహానటి గా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి గారు చనిపోయినప్పుడు నాగేశ్వరరావు చాలా చాలా బాధపడ్డారట.  తప్పుడు నిర్ణయం తీసుకుంది సావిత్రి అంటూ చాలా ఫీల్ అయిపోయారట . అయితే ఇప్పటికీ నాగేశ్వరరావు గారి ఆఖరి డైరీ ..ఆ డైరీలో ఉన్న సావిత్రి గారి ఫోటో పధిలంగా నే అక్కినేని కుటుంబంలోనే ఉందట. నాగార్జున..తన నాన్న గారు నాగేశ్వరరావు గారికి సంబంధించిన ప్రతి వస్తువును కూడా చాలా ఇష్టంగా జ్ఞాపకంగా దాచుకున్నారట. దీంతో ఈ వార్త సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: