![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ram-charan-game-changer-movie-vijay-thalapathy-shankarb1825f7a-95b4-46f8-ab4e-253c05ba9ccb-415x250.jpg)
బాలయ్య కథానాయకుడు సినిమాను బాలకృష్ణ తన సొంత బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకు టాక్ పాజిటివ్ గా వచ్చినా కలెక్షన్ల విషయంలో అదరగొట్టలేదు. అయితే ఎఫ్2 సినిమా మాత్రం సంక్రాంతి కానుకగా లేట్ గా విడుదలైనా కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా ఊహించని స్థాయిలో అదరగొట్టింది. 2019 సంవత్సరంలో విడుదలైన విధంగానే ఈ ఏడాది కూడా సినిమాలు రిలీజవుతున్నాయి.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బాలయ్య డాకు మహారాజ్ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో లక్ పరీక్షించుకుంటున్నారు. ఈ మూడు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ మూడు సినిమాలు బిజినెస్ విషయంలో అదరగొట్టాయి. నిర్మాత దిల్ రాజుకు ఈ ఏడాది సంక్రాంతి ఎంతో కీలకం అని చెప్పవచ్చు. దిల్ రాజు సంక్రాంతి సినిమాలతో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారో చూడాల్సి ఉంది.
నిర్మాత దిల్ రాజు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు కలెక్షన్ల విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 2019 సంవత్సరం బ్యాడ్ మ్యాజిక్ రిపీట్ అయితే మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలకు చుక్కలే అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ సినిమాలు ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.