అల్లు బాబు అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ బాక్సాఫీస్ ఇంకా రఫ్ఫాడిస్తోంది. అవును, లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ దాదాపు రూ.1800 కోట్లు వసూళ్లు రాబట్టి సరికొత్త అధ్యాయాన్ని రచించింది. ఇటు ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ ‘పుష్ప 2’ రికార్డులను కొల్లగొడుతోంది. ఈ తరుణంలోనే కెనడాలో ఈ సినిమా ఏకంగా 4.13 మిలియన్ డాలర్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కెనడాలో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీ గా ‘పుష్ప 2’ నిలిచింది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

గతంలో ఈ రికార్డ్ ‘కల్కి 2898 ఎడి’ పేరిట ఉండేది. అవును, ‘కల్కి 2898 ఎడి’ కెనడాలో 3.5 మిలియన్ డాలర్లతో టాప్ ప్లేసులో ఉండేది. ఇపుడు ఆ రికార్డుని అల్లు బాబు అధిగమించేసాడు. ఇది ఇంకే తెలుగు హీరోకి సాధ్యం కానిదని విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే 'పుష్ప 2' వసూళ్ల పరంపర మున్ముందు కొనసాగుతూనే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వారికి ఉండగా... మేకర్స్ మాత్రం 2000 కోట్ల వరకు రీచ్ అవుతుందని ధీమాని వ్యక్తం చేస్తున్నారు. అయితే హిందీలో ఈ సినిమా ఎంత కాలం వసూళ్ల పర్వం కొనసాగిస్తుందనే దానిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కేవలం ఒక్క హిందీ బెల్ట్ లోనే పుష్ప సినిమాకి భారీ స్థాయి కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి. హిందీలో ఇప్పటి వరకు ఈ సినిమా 800 కోట్లకు పైనే వసూళ్లు సాధించిందని టాక్ నడుస్తోంది. ఇదే పరంపర కొనసాగితే భవిష్యత్తులో అల్లు అర్జున్ నుంచి రాబోయే అన్ని సినిమాలు 1000 కోట్లకి పైగానే అక్కడ వసూళ్లు చేసే అవకాశాలు ఉన్నాయని సినిమా పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: