తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకులలో రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది .. ఆయన సాధించిన విజయాలు  ఆయనను చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి . అలాగే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చి పెట్టాయి . ఇప్పటివరకు 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకులు ఎవరూ లేరు .. అలాంటిది రాజమౌళి తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయమలు అవ్వడమే కాకుండా ఆయనకు ఊహించని గుర్తింపు తీసుకొచ్చి పెట్టాయి. మరి అలాంటి దర్శకుడు ఇప్పుడు  మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు.


ఇక రీసెంట్ గానే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాల్లో మహేష్ బాబు అడ్వెంచర్స్ చేస్తూ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడిని అలరించే ప్రయత్నం చేయబోతున్నాడు. అయితే ఇక్కడ వరకు బానే ఉంది కానీ రాజమౌళి ఇంతకుముందే మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని కమిట్ అయ్యాడు .. మర్యాద రామన్న సినిమా స‌మ‌యం లోనే మహేష్ , రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉంది. అప్పుడే మహేష్ బాబు కూడా రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేయబోతున్నారంటూ ఒక ట్వీట్ కూడా వైరల్ అయింది. ఇక ఆ సమయంలో ఇద్దరు వరుస‌ సినిమాలతో బిజీగా ఉండటం కారణంగా సినిమా చేయడానికి కుదరలేదు .. అయితే గతంలో రాజమౌళి మహిష్ తో ఈ సినిమా కాకుండా ఇంతకుముందు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో మహేష్ బాబుని చూపించాలనే ప్రయత్నం కూడా చేశారట ..


విక్రమార్కుడు సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ దానికి తగ్గట్టుగా మహేష్ బాబుని అలాంటి ఒక సూపర్ పవర్ఫుల్ పాత్రలో చూపించే ప్రయత్నం చేయాలని అనుకున్నప్పటికీ ఆ సినిమా చేసే సందర్భం అయితే వీళ్లకు రాలేదట. ఇక దాంతో ఇప్పుడు అలాంటి సినిమాలు చాలా నచ్చాయి కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి సినిమా చేసే దానికంటే అడ్వెంచర్ జానర్ లో సినిమా చేస్తే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఉద్దేశంతో ఆయన ఈ సినిమాను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరి ఏదేమైనా కూడా మహేష్ బాబు ఏ పాత్రలో అయినా పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు. ఇక రాజమౌళి మేకింగ్ గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. ఆయన ఏ సినిమా తీసిన కూడా అందులో తన మార్క్ కచ్చితంగా ఉంటుంది. మరి ఇప్పుడు మహేష్ తో చేసే సినిమాతో తెలుగు సినిమాకు ఎలాంటి క్రేజ్ తీసుకు వస్తారా చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: