ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో కొన్ని కొన్ని అవకాశాలు రేర్గా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అలాంటి అవకాశాలు రావచ్చు.. మరికొన్నిసార్లు రాలేకపోవచ్చు . కారణం ఏదైనా సరే స్టార్స్ మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ తమ లైఫ్ లో వన్ ఇయర్ వెళ్ళిపోయిన సరే ఏదో కోల్పోయినట్లు బాధపడిపోతూ ఉంటారు . దానికి కారణం వయసు పెరిగే కొద్దీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతూ ఉండడమే . పెరిగిపోతున్న కాంపిటీషన్ కి మారిపోతున్న ట్రెండ్ కి హీరోయిన్స్ రకరకాలుగా తమ అందాలను ఎక్స్పోజ్ చేయడానికి చూస్తూ ఉంటారు .


కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్  అవుతుంది. అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే పై సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . దానికి కారణం ఆమె తీసుకునే డెసిషన్సే . కెరియర్ స్టార్టింగ్ లో సినిమా హిట్ కొట్టడానికి అల్లాడిపోయిన ఈ ముద్దుగుమ్మ . ఆ తర్వాత ఎలాగోలా తన స్థానాన్ని దక్కించుకుంది. మళ్లీ ఫ్లాప్స్ అంటూ ఐరన్ లెగ్గానే ట్యాగ్ చేయించుకుంది.  ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ వస్తుంది. అయితే మళ్లీ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ లో నటించాలి అంటూ ట్రై చేస్తుందట.



దీంతో జనాలు మండిపడిపోతున్నారు . కష్టపడితే మళ్ళీ అవకాశాలు వచ్చాయి. చేతిలో ఉండేది మూడే  సినిమాలు. ఆ మూడు సినిమాలలో హిట్ అయ్యేది ఏవో ఆ దేవుడికే తెలియాలి . మరి ఇలాంటి మూమెంట్లో ఈ రిస్క్ అవసరమా ..? నువ్వు గాని అలా చేస్తే తలకిందలుగా తపస్సు చేసిన సరే ఇక నిన్ను ఏ హీరో కూడా  తన సినిమాలో పెట్టుకునే పెట్టుకోడు అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పూజా హెగ్డే కి 2025 కలిసి రాదు ఏమో అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: