టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది టాలీవుడ్‌ యాంకర్‌, బీజేపీ నేత మాధవి లత. అలాగే తనను ఆంటీ అంటున్న వాళ్లపై రెచ్చిపోయారు. కొందరు పొట్ట బట్ట ఉన్న అంకుల్స్ అంటూ రెచ్చిపోయారు మాధవి లత. మొన్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి నిర్వహించిన మహిళల ఈవెంట్‌ పై మాధవి లత మాట్లాడారు. దానికి కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి. మాధవి లతపై కేసు పెట్టించారు. అయితే.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి వ్యవహారంపై మాధవి లత తగ్గడం లేదు.

తాజాగా సంచలన పోస్ట్‌ కూడా పెట్టింది మాధవి లత.   కొంతమంది సైకోస్ నన్ను ముసలిదానివి అయిపోయావు అంటున్నారు వయసు జీవితం శాశ్వతం వాళ్ళకి కూడా కాదు అనే నిజం ఎలా మర్చిపోయారు? అంటూ చురకలు అంటించారు.  నా ఏజ్ వచ్చేసరికి మరణం అంచులో ఉండే యువత నన్ను అంటుంటే  నా ఒక్కదానికి  వయసు అవుతుందా ? అని ప్రశ్నింంచారు. మీరంతా శాశ్వత జీవులా అనే డౌట్ వస్తుంది సుమీ అంటూ సెటైర్లు పేల్చారు.

సృష్టి ధర్మం నేను గౌరవిస్తానని... ఔను నేను పుట్టాను పెరిగానని తెలిపారు. నాకు వయసు అవుద్దని తెలిపారు. కొన్నాలకు మరణిస్తానని పేర్కొన్నారు.  దీన్ని ఆపగలిగే దమ్మున్న మనుషులు  శాశ్వతంగా ఉండండి అంటూ పోస్ట్‌ పెట్టారు మాధవి లత.  ఔను నాకు వయసు పెరుగుతుందని... చర్మం ముడతలు వస్తాయన్నారు.  తెల్ల వెంట్రుకలు వస్తాయని... ఇది ప్రకృతి ధర్మం  అని చెప్పారు. సహజం ….. మీరు నన్ను ఆంటీ అన్న అవ్వ అన్నా నాకేం సమస్య లేదని చురకలు అంటించారు.


నా కోసం కాకుండా... మీకోసం ఆలోచన చేస్తే కనీసం నా ఏజ్ వచ్చేసరికి అంకుల్ కాకుండా ఉంటారని చురకలు అంటించారు. 50 ఏళ్ల అంకుల్ నన్ను ఆంటీ అని పిలిస్తే...ఎలా అండి?  అంటూ ప్రశ్నించారు మాధవి లత.  మీరెలా పిలిచినా మీ వయస్సుని ఆపలేను... నా మనసుని మార్చలేరని చురకలు అంటించారు.   ఆపాలి అనే ఆలోచన నాకు లేదు.... శాశ్వత అందం కావాలని కోరిక లేదని చెప్పారు మాధవి లత.


మరింత సమాచారం తెలుసుకోండి: