సూపర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనకు వివాహమైన తర్వాత 11 ఏళ్లకు తల్లిదండ్రులు అయ్యారు.2023 జూన్ 20వ తేదీన ఉపాసన పండంటి ఆడబిడ్డకు సైతం జన్మనిచ్చింది. ఇక తమ కూతురుకి క్లింకారా అని పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ కూతురు ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ పాప వల్ల లక్  కలిసి వస్తుందని ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా తెలియజేయడం జరిగింది. అయితే అప్పుడప్పుడు వెకేషన్ కి వెళ్ళిన సందర్భాలలో లేకపోతే ఏదైనా దేవాలయాలు సందర్శించినప్పుడు మాత్రమే క్లింకారా ఫోటోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.


అభిమానులు కూడా తమ కూతురు ఫోటోని రివిల్ చేయమంటూ ఎన్నోసార్లు మెగా కుటుంబ సభ్యులను అడిగినా కూడా లాభం లేకుండా పోయింది. పుట్టినరోజు సందర్భంగా ఆయన కూడా ఫేస్ను రివీల్ చేస్తారని ఎంతో ఎక్సైటింగ్ గా అభిమానులు చూసిన కానీ కుదరలేదు. అప్పుడప్పుడు క్లింకారా చేసేటువంటి పనుల వల్ల క్యూరియాసిటీని పెంచేస్తోంది తప్ప తన ముఖాన్ని రివిల్ చేయలేదు. అయితే తాజాగా ఉపాసన తన గారాల పట్టి క్లింకారా చేసినటువంటి ఒక పనిని షేర్ చేయడం జరిగింది.


ఈ వీడియోలో రెడ్ కలర్ దుస్తులను ధరించిన క్లింకారా రామ్ చరణ్ నటించిన rrr సినిమాలను డాక్యుమెంటరీ అని వీక్షిస్తున్న సమయంలో తన తండ్రిని చూసిన క్లింకారా ఎంతో ఉత్సాహంగా కేకలు వేస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ విషయాన్ని ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యి ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది.. మిమ్మల్ని చూస్తూ చాలా గర్వంగా ఉంది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని క్యాప్షన్ కూడా జత చేసి రెడ్ హాట్ సింబల్ ని సైతం షేర్ చేయడం జరిగింది ఉపాసన. అందుకు  సంబంధించి ఈ విషయం కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: