టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ చిత్రంగా ఇప్పుడు ఉన్నది గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా హీరో రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా మరొక హీరోయిన్ అంజలి కూడా ఇందులో నటిస్తూ ఉన్నది. జనవరి 10వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతూ ఉండగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం కొనసాగుతూ ఉన్నది. ఈ క్రమంలోనే ఈ రోజున రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు మేకర్స్.


అయితే ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు రాబోతున్న సమయంలో బందోబస్తుని కూడా భారీగానే చిత్ర బృందం ఏర్పాటు చేశారట. ఇదంతా ఇలా ఉండగా తాజాగా బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ కి ముందు నుంచి దూరంగానే ఉన్నది.. వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈమె అస్వస్థకు గురైనట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈమె హాస్పిటల్ పాలైనట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమ్ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తోంది.. మరి ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏమైనా వస్తుందేమో చూడాలి..

కియారా టీమ్ చెక్ పెట్టింది..ఇప్పటివరకు ఈమె ప్రమోషన్స్ లోనే పాల్గొనలేదట. rrr సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా విడుదలవుతున్న సినిమా గేమ్ ఛేంజర్ కావడం చేత భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి నుంచి ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కథ అంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇందులో ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి పాన్ ఇండియా లెవెల్లో హైప్ ఏర్పడుతోంది.. ఏం జరుగుతుందో జనవరి 10వ తేదీ వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: