ఇక మన తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో ఎంతోమంది దర్శకులు ఉన్నారు .. ఇంతమంది దర్శనకులు ఉన్నప్పటికీ ఇంటిలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మాత్రం సుకుమార్ ఒక్కరే అని చెప్పాలి .. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది .. ఇక ప్రజెంట్ పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తున్నాడు ఈ దర్శకుడు .. ఇప్పటికే బాహుబలి 2 , దంగల్ సినిమా రికార్డులను బ్రేక్ చేయడానికి పుష్ప 2 రెడీగా ఉంది. 1800 కోట్లకు భారీ కలెక్షన్లు రాబట్టింది పుష్ప2 . ప్రజెంట్ సుకుమార్ రామ్ చ‌రణ్ తో మరో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ..


అయితే ఇప్పుడు గతంలో చిరంజీవితో ఒక సినిమా చేయడానికి ఒక పవర్ఫుల్ స్టోరీని కూడా రెడీ చేసుకున్నారట సుకుమార్ .. చిరంజీవి కెరియర్ లో వచ్చిన ఇంద్ర , ఠాగూర్ లాంటి సినిమాలను మించి ఈ సినిమా కథ ఉంటుంది అంటూ అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ చెప్పుకొచ్చారు . ఇలా మొత్తానికైతే సుకుమార్ రాసుకున్న కథతో వింటేజ్ చిరంజీవిని చూపించే విధంగా ఉండటమే కాకుండా ఇప్పటివరకు ఏ సీనియర్ హీరో చేయనటువంటి ఒక ప్రయోగాత్మక పాత్రలో మెగాస్టార్ ను చూపించాలని అనుకుంటున్నారట .. అయితే ప్రస్తుతం ఇటు సుకుమార్ అటు చిరంజీవి కూడా ఇద్దరు బిజీబిజీగా ఉండటం కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది . అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి రాబోతుందని విషయాలు మీద సరైన క్లారిటీ లేదు .


అలాగే ఈ సినిమా వస్తుందా రాదా అని అనుమానాలు కూడా వస్తున్నాయి . ఇలా మొత్తానికైతే సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియాలోనే టాప్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లో అయినా చిరంజీవి , సుకుమార్ కాంబినేషన్లో అనుకున్న సినిమా వస్తుందా రాదా అనేది కాలమే నిర్ణయించాలి . ప్రజెంట్ రామ్ చరణ్‌తో రెండోసారి సుకుమార్ కలిసి పనిచేయబోతున్నారు కాబట్టి మెగా అభిమానులు కూడా ఆనందంలో ఉన్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్టార్ డామ్‌ తెచ్చి పెట్టిన సుకుమార్.  ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే సినిమాతో హాలీవుడ్ సినిమాను షేక్ చేయటం ఖాయమని కూడా అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: