తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ డైరెక్టర్స్‌ కి మంచి గుర్తింపు ఉంటుంది .. అలాగే వారి దగ్గర నుంచి వచ్చే ప్రతి సినిమా ఇండస్ట్రీలో గొప్ప విజయం సాధించేదిశ‌గా అడుగులు వేస్తుంది. ఇప్పటివరకు ఉన్న యంగ్ డైరెక్టర్లు కొత్త కథ‌ల‌తో సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్న క్రమంలోనే వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు సైతం వైవిద్యమైన కథాంశంతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు .. అందుకే ఆయన వరుసగా మంచి విజయాలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇక మన టాలీవుడ్ లో యంగ్ దర్శకులు వారికంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని ముందుకు పోతున్నారు .. ఇప్పటివరకు స్టార్ దర్శకులు వారికి వారీగా స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా వారి కంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు .. కానీ వెంకీ అట్లూరి  లాంటి క్రేజీ దర్శకులు వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .


ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తూ ముందుకు వెళుతున్న క్రమంలో వెంకీ అట్లూరి ఇప్పటివరకు ఇతర భాష హీరోలతో సినిమాలు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి ? అంటే మన తెలుగు హీరోల నుంచి అతనికి సరైన సహకారం ఉండటం లేదట . ఇప్పటివరకు ఆయన కొంతమంది హీరోలకు కథలు చెప్పినప్పటికీ వారు సినిమా కథలో వేలు పెట్టడం కథను మార్చమని చెప్పడంతో ఆయన ఇతర భాష హీరోలతో సినిమా చేస్తున్నట్టుగా ఒక ఇంటర్వ్యూలు ఆయన చెప్పుకొచ్చాడు . ఇలా మొత్తానికి వెంకీ అట్లూరీకి హ్యాండ్ ఇచ్చిన హీరోలలో నితిన్ , నాని , నాగచైతన్య , సాయిధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోలు ఉండటం విశేషం.


ఈ నలుగురు హీరోలు కూడా ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధిస్తూ ముందుకు వెళుతున్నారు . ఇక ఇప్పటివరకు వీళ్లకు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది .. ఇక మరి రాబోయే సినిమాలతో కూడా వీరు మంచి విజయాలు అందుకుని తమ క్రేజ్‌ను పెంచుకుని స్టార్ హీరోలుగా మారుతారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు .. అయితే అలాంటి ఈ హీరోలు వెంకీ అట్లూరి చెప్పిన కథల జడ్జిమెంట్ విషయంలో మాత్రం ఫీల్ అయ్యారని చెప్పాలి . అందువల్లే ఒక్క దర్శకుడు విజయం కి వ్యాల్యూ ఇచ్చి అతను ఎలా సినిమాలయితే చేయాలనుకుంటున్నాడు అలా సినిమాను చేయించుకున్న హీరోలు దొరకటం కూడా గోప్ప‌ అదృష్టమనే చెప్పాలి . మరి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి హీరో తనకు అనుకూలంగా కథ‌ను మార్చమని యదవ సలహాలు ఇచ్చే వారే తప్ప కథ ఏం కోరుకుంటుందో దానికి మనమే చేయాలో ఆలోచించే హీరోల సంఖ్య చాలా తక్కువ మాత్రమే ఉంది. ఇలా వెంకీ అట్లూరిని నమ్మి ధనుష్ , దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు మంచి విజయాలు అందుకుని స్టార్ స్టేటస్ అందుకున్నారు . ఇక మరోసారి వాళ్ళతోనే సినిమాలు చేయడానికి ఈ దర్శకుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: