కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం దేవర. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఆచార్య వంటి డిజాస్టర్ సినిమాల తర్వాత ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని కసి, పట్టుదలతో కొరటాల శివ దేవర సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి కొరటాల శివ ఈ సినిమాను తీశారు. అప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి సక్సెస్ అందుకుంది.


మొదటినుంచి దేవర సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా విడుదలైన ప్రచార చిత్రాలలో ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. దేవర సినిమా ఏకంగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. దేవర సినిమా 52 సెంటర్లలో 50 రోజులు ఆడి ఇటీవలే 50 రోజులు ఆడిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు దేవర సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది.


ఈ సందర్భంగా దేవర సినిమా యూనిట్ నుంచి 100 డేస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే దేవర 100 రోజులు ఆరు సెంటర్లలో ఆడుతుందని అనౌన్స్ చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాలోని మలికిపురం పద్మజా థియేటర్, మండపేట రాజారత్న థియేటర్, కొత్తకోట ద్వారకా థియేటర్, చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్, కల్లూరు MNR థియేటర్, బొంపిచర్ల MM డీలక్స్ థియేటర్లలో దేవర సినిమా 100 రోజులు ఆడినట్లుగా అనౌన్స్ చేశారు.


దేవర 100 డేస్ అనౌన్స్మెంట్ తో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకే దేవర సినిమా నెట్ఫ్లిక్స్ లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చాలామంది వీక్షిస్తున్నారు. ఇక దేవర సినిమాకు పార్ట్-2 కూడా అనౌన్స్ చేసి ఈ సినిమా చివర్లో లీడ్ ఇచ్చారు. మరి దేవర సినిమా పార్ట్-2 సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: