కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, హిందీ, తమిళ సినిమాలలో నటిస్తూ ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటుంది. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. కొన్ని సంవత్సరాల నుంచి సౌత్ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.


ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కీర్తి సురేష్ అడుగు పెట్టింది. వరుణ్ దావన కు జోడిగా బేబీ జాన్ అనే సినిమాలో కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ చాలా కష్టపడింది. రీసెంట్ గానే ఈ బ్యూటీ వివాహం చేసుకుంది. కీర్తి సురేష్ తన చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టీల్ ను వివాహం చేసుకుంది. దాదాపు 15 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట వివాహ బంధంతో ఒకటయ్యారు. మొదట హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.


అనంతరం క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కీర్తి సురేష్ హిందువు కాగా, ఆంటోనీ క్రైస్తవ మతస్థుడు కావడంతో ఈ రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం జరిపించుకున్నారు. అయితే రెండు పద్ధతులలో వివాహం చేసుకోవడం అనే సరికి చాలా విమర్శలు వచ్చాయట. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ సైతం క్రైస్తవ మతాచార ప్రకారం వివాహానికి తన తండ్రి ఒప్పుకుంటాడో లేదోనని చాలా భయపడిందట. కానీ తన తండ్రి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా క్రైస్తవ పద్ధతిలోనూ వివాహానికి అంగీకరించినట్లుగా వెల్లడించింది. తన తండ్రి నుంచి ఆ రకమైన రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయానని కీర్తి సురేష్ అన్నారు.


 అలాగే ఆంటోనీని ఇంటర్మీడియట్ లో మొదటిసారి కలిశానని తనకంటే ఆంటోనీ ఏడేళ్లు పెద్దవాడు అని కీర్తి సురేష్ వెల్లడించింది. ఖతర్ లో కొన్నాళ్లపాటు ఆంటోని వర్క్ చేశాడని ఆ సమయంలో దాదాపు ఆరేళ్లపాటు ఇద్దరం వేరుగా ఉన్నామని కీర్తి సురేష్ చెప్పింది. కరోనా సమయానికి అది లివ్ ఇన్ రిలేషన్ షిప్ గా మారిందని తెలిపింది. కోవిడ్ సమయంలో ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్లుగా కీర్తి సురేష్ వెల్లడించింది. కీర్తి సురేష్ వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమంలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: