గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అనగా జనవరి 4న ఏపీలోని రాజమండ్రిలో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. చాలా రోజుల నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ కూడా వస్తారని ప్రచారం జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ రావడం రావడమే మెగా పంచులు ఇస్తూ అల్లు అర్జున్ తో పాటు మరో ఇద్దరిని కూడా టార్గెట్ చేశాడు. మరి ఇంతకీ అల్లు అర్జున్ కి ఏ విధంగా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు అనేది చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్  ఈవెంట్లో మాట్లాడుతూ.. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి.పవర్ స్టార్ అనుకోవచ్చు.. ఓజీ అనుకోవచ్చు గేమ్ చేంజర్ అనుకోవచ్చు. 

కానీ అందరూ చిరంజీవి తర్వాతే..చిరంజీవి మా ఎదుగుదలకు మూలం.మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినా కూడా అస్సలు అహంకారానికి పోడు. ఎప్పుడు తక్కువ స్థాయిలోనే ఉంటాడు. ఎంత ఎదిగిన ఎక్కడినుండి వచ్చామో ఆ మూలాలను మర్చిపోవద్దు. మేము ఎప్పటికీ చిరంజీవి తర్వాతే. ఒక హీరోని ద్వేషించడం మాకు తెలియదు. చిరంజీవి ఆశీస్సుల వల్లే మేము ఇక్కడ ఉన్నాం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.అలాగే టికెట్ రేట్లు ఎందుకు పెంచరు. టికెట్ రేట్లు పెంచితే అందులో 18 శాతం జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికే వస్తుంది కదా.. టికెట్ రేట్లపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ రేవంత్ సర్కార్ కి కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు.

అలాగే నా సినిమాకి టికెట్ రేట్ పెంచలేదు. టికెట్ రేట్లు పెంచమని మా దగ్గరికి వచ్చి హీరోలు అడగనక్కర్లేదు. నిర్మాతలు వస్తే చాలు.హీరోలతో నమస్కారాలు పెట్టించుకునే అంత స్థాయిలో మేము లేం. ఏ హీరో నైనా మేము ఒకటిగానే చూస్తాం.మా కూటమికి సపోర్ట్ చేయకపోయినా కూడా ఆ హీరోలపై మాకు ఎలాంటి ద్వేషం లేదు. గత ప్రభుత్వం లాగా మేము ప్రవర్తించము అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా చురకలు అంటించారు. అలా ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లు పవన్ కళ్యాణ్ ప్రసంగంతో అటు రేవంత్ రెడ్డికి, ఇటు జగన్ మోహన్ రెడ్డికి మరోవైపు అల్లు అర్జున్ కి కూడా పరోక్షంగా చురకలు అంటించారు పవన్ కళ్యాణ్.ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు మీడియాలో వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: