తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ క్రేజ్ నీ సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ బ్యూటీ సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో అత్యంత తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.

టాప్ హీరోయిన్స్ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఈమె చాలా రోజుల పాటు అలాగే కెరియర్ను కొనసాగించింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె తెలుగు సినిమాల్లో నటించడం లేదు. కేవలం తమిళ్ , హిందీ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన నాన్నకు ప్రేమతో అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను 2016 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు.

మూవీ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ కి సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అదుర్స్ సినిమాను మినహాయిస్తే ఏ సినిమా కూడా మంచి విజయం సాధించలేదు. నాన్నకు ప్రేమతో సినిమా మాత్రం చాలా సినిమాలతో కాంపిటేషన్ గా విడుదల అయినా కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో సంక్రాంతికి రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం దక్కింది. ఈ మూవీ లో రకుల్ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీ తో ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: