బాలకృష్ణ చేసిన పనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే బాలకృష్ణపై దారుణంగా మండిపడుతున్నారు.ఎన్టీఆర్ పై బాలకృష్ణ కి ఎందుకు అంత కోపం..అంత చేయకూడదు తప్పు ఏం చేశాడు..మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టాడు.. ప్రతిసారి ఆయన మీ ప్రేమ కోసం తహతహలాడుతుంటాడు. కానీ మీరు మాత్రం దూరం పెడుతూనే ఉన్నారు. ఆయన చేసిన తప్పేంటి అంటూ సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. అయితే బాలకృష్ణ రీసెంట్గా డాకూ మహారాజ్ చిత్ర యూనిట్ అన్ స్టాపబుల్ షో కి వచ్చిన సమయంలో డైరెక్టర్ బాబి డైరెక్షన్లో వచ్చిన హిట్ సినిమాలు అన్నింటిని ఒక్కొక్కటిగా చెప్పారు. కానీ బాబీ డైరెక్షన్లో వచ్చిన అతి పెద్ద హిట్ అయినటువంటి ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా పేరు మాత్రం తీయలేదు. బాబీ డైరెక్షన్లో అంతపెద్ద హిట్ అయిన జై లవకుశ పేరు కూడా ఎత్తకపోవడం బాలకృష్ణ కి ఎన్టీఆర్ పై ఎంత పగ ఉందో అర్థం చేస్తుంది. 

అలాగే గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం అన్ స్టాపబుల్ షో కి రామ్ చరణ్ ని కూడా ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి మీ జర్నీ ఎలా సాగింది అని కూడా ఎన్టీఆర్ గురించి రామ్ చరణ్ ని అడగలేదు. అలాగే లక్కీ భాస్కర్ చిత్ర యూనిట్ వచ్చిన సమయంలో కూడా అన్ని సినిమాల పేర్లు చెప్పి అజ్ఞాతవాసి వంటి భారీ ప్లాప్ తర్వాత వచ్చిన అరవింద సమేత పేరు చెప్పలేదు.ఇక అరవింద సమేత పేరు వదిలేసి అలవైకుంఠపురం పేరుని ప్రస్తావించారు. అలా బాలకృష్ణ ఎన్టీఆర్ ని ప్రతి విషయంలో సైడ్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగోఘోరంగా హర్ట్ అయింది. దాంతో సోషల్ మీడియా వేదికగా డాకు మహారాజ్ ని బాయికాట్ చేస్తున్నాం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.

ఇక ఈ పోస్టులు చూసి ఏం జరుగుతుందో నని భయపడిన డాకు మహారాజ్ నిర్మాత బాలకృష్ణ మాటల వల్ల తన సినిమాకి నష్టం కలుగుతుంది అని భావించి వెంటనే సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. "ఈ సినిమా మన అందరిదీ..సినిమాని హిట్ చేయాల్సిన బాధ్యత మనకి ఉంది.. అందరూ సినిమాని చూసి మన సినిమాని అతిపెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని నేను కోరుకుంటున్నాను..మీ అందరి సపోర్ట్ నాకు కావాలి.." అంటూ పరోక్షంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి పోస్టు పెట్టారు.దీంతో బాలకృష్ణ చేసిన పనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని నిర్మాత నాగ వంశీ వేడుకోవలసిన పరిస్థితి వచ్చింది అంటూ సోషల్ మీడియా జనాలు మాట్లాడకుంటున్నారు.. ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ అలా ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ ని సైడ్ చేయడం మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు మిగతా హీరో ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదు. బాలకృష్ణపై సోషల్ మీడియాలో నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: