ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గట్టిగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు “రష్మిక మందన్న “.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు ఇప్పుడు ఆమెనే మొదటి ఛాయిస్..అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాతో రష్మిక మందన్న పాన్ ఇండియా వైడ్ మంచి పాపులరిటీ సంపాదించుకుంది.. 2023 లో వచ్చిన రణ్ బీర్ కపూర్ “ యానిమల్ “ సినిమాలో తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.. అలాగే రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 సినిమా తో ఈ భామ క్రేజ్ మరింత పెరిగింది.. ఈ భామ ఖాతాలో ఇప్పటికే భారీ పాన్ ఇండియా మూవీస్ వున్నాయి..ఈ భామని అందరూ లక్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు.. రష్మిక నిజంగా లక్కీ బ్యూటీనే.. సంక్రాంతి సీజన్ కి టాలీవుడ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 

ఆ సీజన్ లో హిట్ కొడితే సంక్రాంతి హీరో లేదా సంక్రాంతి హీరోయిన్ అని పేరు వస్తుంది.. ఇలా చూసుకుంటే రష్మిక రెండు సార్లు సంక్రాంతి లక్కీ హీరోయిన్ అనిపించుకుంది.. గతంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన “ సరిలేరు నీకెవ్వరూ “ అనే సినిమా జనవరి 10 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా హిట్ అవ్వడం తో రష్మిక సంక్రాంతి హీరోయిన్ అయింది..ఇక 2023 లో దళపతి విజయ్ హీరోగా తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన “ వారీసు “... తెలుగు లో “ వారసుడు” పేరుతో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ గా నటించింది..సంక్రాంతికి వచ్చిన వారసుడు సినిమా కూడా సూపర్ హిట్ కావడం తో రష్మిక సంక్రాంతి లక్కీ హీరోయిన్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: