టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథ రచయితగా పని చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 , భగవంత్ కేసరి అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఈయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈయనకు దర్శకుడిగా సూపర్ క్రేజ్ ఉంది. తాజాగా ఈయన విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈయన తన తదుపరి మూవీ ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవితో ఎలాంటి సినిమా చేయాలని ఉంది అనే దానిపై స్పందించాడు.

తాజాగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... మెగాస్టార్ చిరంజీవితో ఓ క్యారెక్టర్ బేస్డ్ సినిమా చేయాలని ఉంది. ఆయన ఓల్డ్ సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే ఆ క్యారెక్టర్ లో ఆయన పర్ఫామెన్స్ కూడా సూపర్ గా ఉంటుంది. అలా ఆయన ఓల్డ్ స్టైల్ యాక్టింగ్ తో ఓ సినిమాను రూపొందించాలని ఉంది అని అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: