తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో జీవా ఒకరు . ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందు లో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకుని కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇకపోతే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం రంగం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేయగా ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

మూవీ తో జీవా కు తెలుగులో కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన అనేక సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. కానీ అందులో ఎక్కువ సినిమాలు మంచి విజయాలను అందుకోలేదు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం శంకర్ , తలపతి విజయ్ హీరో గా స్నేహితుడు అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ స్నేహితుల పాత్రలలో జీవా కూడా నటించాడు.

ఇక ఈ సినిమా కూడా తెలుగు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈయన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో బాగా పెరిగింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈయన సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఈయన కెరియర్లో తక్కువ సినిమాలే చేసిన కూడా పెద్ద మొత్తం లోనే ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఈయనకు 90 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఈయన సినిమాల ద్వారా పెద్ద మొత్తం లోనే డబ్బులు వెనకేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: