ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ బాగానే కష్టపడింది. మరి ముఖ్యంగా పెళ్లి తర్వాత ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా పాల్గొనింది . ఇదే మూమెంట్లో పెళ్లి తర్వాత కీర్తి సురేష్ మెడలో తాళి వేసుకొని కనిపించడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఈవెంట్స్ కి అటెండ్ అవుతున్నప్పుడు ఫోటోగ్రాఫర్లు కీర్తి సురేష్ పిక్స్ తీసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించారు . అయితే ఓ ఈవెంట్లో కీర్తి సురేష్ ని ఓ ఫోటో గ్రాఫర్ బ్యాడ్ యాంగిల్ లో ఫొటోస్ తీయడానికి ఆసక్తి చూపించారు .
కీర్తి కారులోకి ఎక్కుతూ ఉండగా అవతలి వైపు నుంచి ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తూ ఉంటే అప్పుడే కీర్తి సురేష్ అసిస్టెంట్ వచ్చి వాదించారు . అంతేకాదు దీని మీద చిన్న గొడవ కూడా జరిగింది . అయితే కీర్తి ఆ గొడవ పై తాజాగా స్పందించింది . "ఆ గొడవ అసలు ఎందుకు జరిగిందో..? ఎలా జరిగిందో ..? నాకు ఆ టైంలో అర్థం కాలేదు . తర్వాత నా అసిస్టెంట్ నాకు వివరంగా వివరించింది . నేను అప్పటికే చాలా ఫోటోగ్రాఫర్స్ కి ఫోజులు ఇచ్చాను. అడిగితే ఇంకా కొన్ని కూడా ఇస్తాను. కానీ అలా కారులో ఎక్కుతూ ఉండగా బెండ్ అయినప్పుడు అవతల నుంచి ఫోటో తీయడం కరెక్టేనా..? అది ఎంత బ్యాడ్ యాంగిల్ అనేది తెలియదా..? అలాంటి ఫోటోలు తీయడం ద్వారా వాళ్ళకి ఏమి వస్తుంది..? అది తప్పు కదా ..? అంటూ ఫైర్ అయింది. ఓపికగా ఫోటోలకి ఫోజులు ఇచ్చిన తర్వాత కూడా ఇలా చేయాల్సిన అవసరం ఏముంది ..? అంటూ మండిపడింది . కాగా ఓ ఈవెంట్లో కీర్తి సురేష్ రెడ్ డ్రెస్ వేసుకుని జీప్ దిగుతూ ఉండగా కొందరు ఫోటోగ్రాఫర్లు ఫోటో తీసి ఎంత వైరల్ చేశారో చూసాం". బోల్డ్ కామెంట్స్ కూడా వినిపించాయి . దీంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . అసలు సిగ్గు ఉండేవాళ్ళు అలా చేస్తారా..? ఒక అమ్మాయిని అలా ఫొటోస్ తీస్తారా..? అంటూ ఫైర్ అవుతున్నారు..!