ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అయితే ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ఆయన పేరు పై పొలిటికల్ పరంగానే ఎక్కువగా వార్తలు వినిపించేవి. చాలా టైం తర్వాత.. పక్కాగా చెప్పాలి అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు సంబంధించిన సినిమాలపరంగా కన్నా కూడా పొలిటికల్ పరంగానే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి . అయితే ఇప్పుడు మాత్రం "గేమ్ చేంజర్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొని మరొకసారి తెలుగు హీరోగా ఆయన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంటున్నాడు.


కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ కీయర అద్వానీ తెలుగు హీరోయిన్ అంజలి హీరోయిన్లుగా నటించిన సినిమా "గేమ్ చేంజర్". ఈ సినిమా జనవరి 10వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కాగా ఇదే క్రమంలో స్టేజ్ పైకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ హైలైట్ గా మారింది .



"మరీ ముఖ్యంగా మనం ఎంత ఎత్తుకు ఎదిగిన మూలాలను మర్చిపోకూడదు అంటూ .. మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము అంటే కారణం మెగాస్టార్ చిరంజీవి గారే అంటూ హైలెట్ గా మాట్లాడారు . అంతేకాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నాకు తమ్ముడు లాంటివాడు అని ..నాకు తమ్ముడితో సమానం అని చాలా గొప్పగా చెప్పారు . అంతేనా ఏపీని చిన్నచూపు చూడొద్దు అంటూ దిల్ రాజుకు విజ్ఞప్తి చేయడంతో మరింత హీట్ పెరిగిపోయింది.. గేమ్ ఛేంజర్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుంది " అంటూ ధీమా వ్యక్తం చేశారు . అయితే ఈ వేడుకలో  ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఎవరిని ఉద్దేశించి అనే విషయం ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూసింత ఎక్కువగానే రాంచరణ్ ని పొగిడేసాడు అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు . ఒక స్టార్ హీరో ప్రమోషన్ ఈవెంట్ కి రావడం మంచిదే కానీ ఈ రేంజ్ లో పొగిడేస్తూ సినిమాకి మరింత హైప్ రావడానికి తన పొలిటికల్ రేంజ్ ని కూడా వాడుకోవడం ఎంతవరకు న్యాయమంటూ..?? కొంతమంది యాంటీ మెగా ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: