దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తరగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓవెలుగు వెలుగుతున్నటువంటి ఈమె సినీ కెరియర్ లో ఎంతో ఒక మంచి సక్సెస్ సాధించారు.ఇదిలావుండగా సంక్రాంతి వచ్చిందంటే.. సంతోషం సంబరంగా మారుతుంది. ఆనందం అందరింటా సందడి చేస్తుంది. వాటితో పాటు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సినిమాలు కూడా సిద్ధంగా ఉంటాయి. ఈ క్రమంలో సంక్రాంతి బరి లో నయనతార సినిమాలు కూడా విడుదలై మంచి హిట్ ను సొంతం చేసుకున్నాయి. అలాంటి వాటిలో2006 జనవరి 14న విడుదలైన లక్ష్మి మువీ ఒకటి.వివి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 33కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.అలాగే తెలుగుభాషా యాక్షన్ డ్రామాచిత్రం, శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు బుజ్జినిర్మించారు , దీనికి దర్శకత్వం వివి వినాయక్మరియు సినిమాటోగ్రఫీ ఛోటా కె. నాయుడు. వెంకటేష్, నయనతార, ఛార్మి కౌర్నటించారు .

ఈ చిత్రానికి సంగీతం రమణ గోగులస్వరాలు సమకుర్చారు . ఈ చిత్రం బాక్సాఫీస్వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది మరియు నయనతార టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన తొలి తెలుగు సినిమా.అలాగే సంక్రాంతి బరిలో హిట్ గా నిలిచిన నయనతార అదుర్స్ మూవీ కూడా ఒకటి.అదుర్స్ 2010 లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో జూనియర్ ఎన్. టి. ఆర్, నయనతార, షీలా ప్రధాన పాత్రల్లో నటించారు. జూనియర్ ఎన్.టి.ఆర్ మొదటి సారిగా ద్విపాత్రాభిమానం చేసిన చిత్రం ఇది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. 2010 జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా 1300 తెరలమీద విడుదలైన ఈ సినిమా వాణిజ్య పరంగా మంచి లాభాలు రాబట్టింది. 155 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి బరిలో లక్కీ హీరోయిన్ గా సక్సెస్ అందుకుంది.ప్రస్తుతం నయనతార చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా వుంది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: