టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. దీంతో హీరోయిన్ విద్యాబాలన్ ను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ విద్యాబాలన్. ఎక్స్పోజింగ్ తో పాటు... అద్భుతమైన నటనతో దూసుకు వెళ్తున్నారు విద్యాబాలన్. ముఖ్యంగా ఆమె డర్టీ పిక్చర్ ద్వారా బాగా పాపులర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.


అప్పటి నుంచి విద్యాబాలన్ పేరు వినగానే డర్టీ పిక్చర్ మాత్రమే అందరికీ గుర్తుకు వస్తూ ఉంటుంది. అంతలా ఆ సినిమాతో పాపులర్ అయ్యారు.   అయితే అలాంటి బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతం... ఆయన రియల్ సూపర్ స్టార్... అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు హీరోయిన్ విద్యాబాలన్. ఈ మేరకు సోషల్ మీడియాలో.. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.


దీంతో రోహిత్ శర్మ అంటే పడని వాళ్ళు కొంతమంది ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ముందు రోహిత్ శర్మను... సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి మేడం అంటూ నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త ఫాంతో ఉన్న నేపథ్యంలో... అద్భుతమని ఎలా పోస్ట్ పెడతారని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కావాలని రోహిత్ శర్మ PR టీం ఇలా చేయిస్తోందని.... సెటైర్లు పేల్చుతున్నారు. ఇకపై ఇలాంటి పోస్టులు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి మేడం అంటూ చురకలాంటిస్తున్నారు ఫాన్స్.


ఇది ఇలా ఉండగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 టోర్నమెంట్లో... టీమిడియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత దారుణంగా ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఒక మ్యాచ్లో కూడా పెద్దగా రాణించలేదు రోహిత్ శర్మ. దీంతో ఐదో టెస్టులో.. జట్టుకు భారం కాకూడదని... తప్పుకున్నాడు. దీంతో అతడు రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: